నేడే బడ్జెట్: ఎన్నికలే లక్ష్యం, చిదంబరం వరాలిస్తారా?

P Chidambaram
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్ 2013-14ను కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర వార్షిక బడ్జెట్‌ను హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థశాస్త్ర నిపుణుడు రూపకల్పన చేశారు. యుపిఎ - 2 ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. దీంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చిదంబరం బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజలకు వరాల ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ ఎన్నికలకు తోడు దిగజారుతున్న దేశ వృద్ధిరేటు, పెరిగిపోతున్న నిరుద్యోగం, మొత్తంగా ఓ ఆర్థిక సంక్షోభం నెలకొన్ని తరుణంలో చిదంబరం తన అనుభవాన్నంతా రంగరించి ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయగా, దాన్ని లోక్‌సభలో గురువారం ఉదయం 11 గంటలకు బహిరంగపరచనున్నారు.

మాజీ ప్రధాని, గతంలో సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మొరార్జీ దేశాయ్ తర్వాత ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఘనతను ఈ చిదంబరం దక్కించుకున్నారు. ఒకవైపు ఎన్నికల నేపథ్యంలో ప్రజలను, ఓటర్లను సంతృప్తిపర్చాల్సిన బాధ్యత చిదంబరంపై ఉందని భావిస్తున్నారు. దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దాల్సిన కర్తవ్యం కూడా ఆయన మీద పడింది. దీంతో యుపిఎ -2 ప్రభుత్వానికి ఈ బడ్జెట్ ఓ అగ్నిపరీక్షగా మారనుంది.

అదేసమయంలో సబ్సిడీల భారాన్ని తగ్గించుకోవాలని అనేక నిపుణుల కమిటీలతో పాటు ఆర్థిక సర్వే సూచనలు చేసిన నేపథ్యంలో సంస్కరణల మార్గం మరింత వేగం పుంజుకుంటుందన్న అభిప్రాయాల నడుమ కార్పొరేట్, పారిశ్రామిక వర్గాలకు సానుకూలతను ప్రదర్శిస్తుందనే వాదనలూ లేకపోలేదు. మొత్తం మీద అందరినీ సంతృప్తిపరిచేవిధంగా, దిగజారుతున్న ఆర్థిక వృద్ధిని పట్టాలపైకి ఎక్కించేలా, విత్త లోటును మరింత తగ్గించుకునేలా చిదంబరం ఎలాంటి మాయాజాలం ప్రదర్శిస్తారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+