అధికారంలో ఉంటే ఓట్లు ఫట్: కిరణ్, అవివేకం: జెసి

Kiran Kumar Reddy - JC Diwakar Reddy
హైదరాబాద్: అధికారంలో ఉంటే ఓట్లు నష్టపోతామంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త భాష్యం చెప్పారు. శనివారం ఆయన మాజీ శాసన సభాపతి దివంగత శ్రీపాదరావు జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేస్తే పదివేల ఓట్లు పోతాయని, అదే మంత్రిగా ఉంటే మరో పదిహేను వేల ఓట్లు అదనంగా పోతాయని కిరణ్ కొత్త లెక్క చెప్పారు.

నష్టపోయిన మేరకు కొత్త ఓట్లు సాధిస్తేనే కానీ ఎన్నికల్లో విజయం సాధించలేమన్నారు. గతంలో శ్రీధర్ బాబు పేరు సభాపతి పదవికి పరీశీలనకు వచ్చినప్పుడు.. తనకు మంత్రి పదవే కావాలని ఆయన పట్టుబట్టారని, ఆయనకు తొందరబాటు ఎక్కువని, మరికొం రాజకీయ అనుభవం కావాలని సరదాగా అన్నారు.

రాజకీయాలు పైకి కనిపిస్తున్నంత హాయిగా, ఆకర్షణీయంగా ఉండవని చెప్పారు. ఎన్నో ఇబ్బందులు ఉంటాయన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని బాధ్యతగా పని చేస్తేనే ప్రజాధరణ ఉంటుందన్నారు. తాను రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని, ఓ దురదృష్ట సంఘటన వల్ల రావాల్సి వచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

అవివేకం..

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలనుకోవడం అవివేకమని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఏడాది క్రితమే అవిశ్వాస తీర్మానం పెట్టి భంగపడ్డారని, మళ్లీ బలాబలాలను బేరీజు వేసుకోవాలన్న తెలివితక్కువ ఆలోచన ఎందుకని ప్రశ్నించారు. దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ తొడగొట్టి మరీ కిరణ్ సవాల్ విసిరారంటే తమ శాసనసభ్యులపై ఆయనకున్న నమ్మకం ఏమిటో గుర్తుంచుకోవాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+