బాబు వెనుకే బాలయ్యఅడుగు! అమ్మ ఇంట బావ వెంట

Chandrababu Naidu - Balakrishna
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేత, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కృష్ణా జిల్లా కపిలేశ్వరంలో కలుసుకున్నారు. బాబును కలుసుకున్న బాలయ్య మొదట చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, పార్టీ నేతల నుండి ఆరా తీశారు. అనంతరం చంద్రబాబును కలిసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబుతో పాటు రెండు రోజుల పాటు బాలయ్య వస్తున్నా మీకోసం పాదయాత్రలో పాల్గొననున్నారు. బాబు పాదయాత్ర పామర్లు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇదే నియోజకవర్గంలో బాలకృష్ణ తల్లి స్వగ్రామం కొమరవోలు ఉంది. ఈ గ్రామానికి బాబు పాదయాత్ర సోమవారం చేరుకుంటుంది. తల్లి స్వగ్రామం బాబు యాత్ర చేరుకునే సమయానికి బాలయ్య కూడా పాదయాత్రలో పాల్గొంటారు. ఆదివారం నుండే ఆయన బాబుతో కాలు కదుపుతారు.

మరోవైపు హైదరాబాదులో దివంగత స్పీకర్, మాజీ తెలుగుదేశం పార్టీ నేత జిఎంసి బాలయోగి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలో బాలయోగి వంటి దళితుడిని స్పీకర్‌గా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చెప్పారు.

కుప్పంకు నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మూడు రోజుల తర్వాత చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో కుప్పంలో ఉండి పార్టీ నేతలతో సమావేశం అవుతారు. లోకేష్ ఇటీవల కూడా ఓసారి కుప్పం నేతలతో సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+