కుటుంబం కోసం దేశాన్ని.., బయటకొస్తేనే ప్రధాని: మోడీ

Narendra Modi
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ ఓ కుటుంబం అవసరాల కోసం దేశాన్ని వాడుకుంటోందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నిప్పులు చెరిగారు. న్యూఢిల్లీలోని పార్టీ సమావేశంలో ఆయన ఆవేశంగా మాట్లాడారు. గుజరాత్‌లో బిజెపి విజయం ఏ ఒక్కరిది కాదని లక్షల మంది కార్యకర్తలదన్నారు. విజయాన్ని కార్యకర్తలకే అంకితమిస్తున్నట్లు చెప్పారు. గుజరాత్ ప్రజల్లో తాము విశ్వాసం కల్పించామని అందుకే మళ్లీ పట్టం కట్టారన్నారు.

ప్రపంచమంతా ఇప్పుడు గుజరాత్ వైపు చూస్తోందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని, తమను చూసి కాంగ్రెసు, కాంగ్రెసు పాలిత రాష్ట్రాలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. గుజరాత్‌ల విద్యుత్ ఛార్జీలను పెంచి పన్నెండేళ్లవుతోందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలు ఆదర్శ రాష్ట్రాలు అన్నారు. బిజెపికి దేశం విషయంలో ఓ మిషన్ ఉంటే కాంగ్రెసుది కమిషన్ తీరు అన్నారు.

యుపిఏను ఎదుర్కొనేందుకు బిజెపి సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెసులో వారసత్వం మినహా ఏమీ లేదన్నారు. కాంగ్రెసు దేశ ప్రతిష్టను మంటగలిపిందన్నారు. ఈ మూడు దశాబ్దాల్లో కాంగ్రెసు దేశానికి ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ఓ కుటుంబం తన అవసరాలకు దేశాన్ని ఉపయోగించుకుంటోందని నిప్పులు చెరిగారు. అందుకే బలహీనమైన మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా చేశారన్నారు.

ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కాలేకపోయారన్నారు. ఆయన సమర్థుడని కొనియాడారు. ఆయన ప్రధానిగా ఉంటే దేశం ఇన్ని చిక్కుల్లో ఉండేది కాదన్నారు. కాంగ్రెసు గోత్రం లేని ఒకే ఒక్క ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అన్నారు. ఆయన సమర్థ ప్రధాని అని, క్లిష్ట పరిస్థితుల్లో వాజపేయి అణు పరీక్షలు నిర్వహించారని గుర్తు చేశారు. కాంగ్రెసు ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమే అన్నారు.

కాంగ్రెసుకు దేశ ప్రయోజనాలు ఏమాత్రం పట్టవన్నారు. యుపిఏ-2ను సాగనంపేందుకు ప్రజలు ఎప్పుడే సిద్ధమయయారన్నారు. మనలాంటి వాళ్లు ఉండగా కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలో ఉండటమా అని బిజెపిని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెసును కూకటివేళ్లతో పెకిలించాలన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశం ఉన్నప్పుడు కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రజలకు కాంగ్రెసుతో సంబంధాలు తెగిపోయాయని చెప్పారు.

దేశ అభివృద్ధికి కాంగ్రెసు వద్ద ప్రణాళికలు లేవన్నారు. బిజెపిని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. కాంగ్రెసు పార్టీ మొత్తం ఓ కుటుంబంపై ఆధారపడి ఉందన్నారు. కాంగ్రెసు దేశానికి చీడపురుగు అన్నారు. సీతారాం కేసరి లాంటి వాళ్లను కాంగ్రెసు బయటకు గెంటి వేసిందన్నారు. ప్రధాని కావాలంటే కాంగ్రెసు నుండి బయటకు రావాలన్నారు. కాంగ్రెసులో ఉంటే ఇతరులకు ప్రధాని అయ్యే అవకాశాలు ఉండవన్నారు.

మేం నెంబరు కోసం 2014లో పోరాడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు కాంగ్రెసుకు బుద్ధి చెప్పేందుకు మానసికంగా సిద్ధమయ్యారన్నారు. బిజెపి సమర్థ నాయకుడి కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. పారదర్శక పాలనే బిజెపి లక్ష్యమని నరేంద్ర మోడీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+