బావబావమర్ది, వెంట లోకేష్: బాలయ్యే స్పెషల్(పిక్చర్స్)

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఆదివారం ఆయన బావమరిది, హీరో నందమూరి బాలకృష్ణ, బాబు తనయుడు నారా లోకేష్, బాబు సతీమణి నారా భువనేశ్వరి తదితరులు కలిశారు. సోమవారం బాలకృష్ణ చంద్రబాబుతో పాటు పాదయాత్రలో పాల్గొంటున్నారు. శనివారం ఉదయం చంద్రబాబును బాలయ్య కృష్ణా జిల్లాలోని కపిలేశ్వరంలో కలిసి ఆరోగ్యం గురించి వాకబు చేశారు.

బాలయ్య తన స్వగ్రామం నిమ్మకూరుకు చేరుకొని అక్కడ బంధువులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులతో తేనీటి విందును ఏర్పాటు చేశారు. సోమవారం బాబు పాదయాత్ర పామర్రు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇదే నియోజకవర్గంలో బాలకృష్ణ తల్లి స్వగ్రామం కొమరవోలు ఉంది. తల్లి స్వగ్రామం బాబు యాత్ర చేరుకునే సమయానికి బాలయ్య కూడా వస్తున్నా మీకోసం పాదయాత్రలో పాల్గొంటారు.

బాలయ్య కొమరవోలుకు చేరుకున్న కాసేపటికే నారా లోకేష్ కూడా అక్కడకు చేరుకున్నారు. వారిద్దరు తమ బంధువులతో కలిసి ముచ్చటించారు. కొమరవోలు, నిమ్మకూరులో బాలయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సతీమణి బసవతారకం స్వగ్రామం కొమరవోలు కావడంతో కార్యకర్తలు పాదయాత్ర కోసం భారీ ఏర్పాటు చేశారు. బాబు సతీమణి భువనేశ్వరి కూడా అక్కడే ఉన్నారు.

మరోవైపు బాబు పాదయాత్ర ఆదివారం 2,200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కురుముద్దాలిలో చంద్రబాబును అనంతపురం జిల్లా రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత, విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ కలుసుకున్నారు. కాగా గుంటూరు జిల్లా రాజకీయాలపై బాలకృష్ణ కోడెల శివప్రసాద్‌తో భేటీ అయ్యారు.

బావబావమరిది: బాలయ్యే‌ స్పెషల్(పిక్చర్స్)

బాబును పరామర్శించిన బాలకృష్ణ

బావబావమరిది: బాలయ్యే‌ స్పెషల్(పిక్చర్స్)

పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన నారా లోకేష్

బావబావమరిది: బాలయ్యే‌ స్పెషల్(పిక్చర్స్)

నిమ్మకూరులో బాలకృష్ణ

బావబావమరిది: బాలయ్యే‌ స్పెషల్(పిక్చర్స్)

కొమరవోలులో మామతో అల్లుడు

బావబావమరిది: బాలయ్యే‌ స్పెషల్(పిక్చర్స్)

సోమవారం బాబును వల్లభనేని వంశీ కలిశారు. పరిటాల సునీత కూడా కలిశారు.

బావబావమరిది: బాలయ్యే‌ స్పెషల్(పిక్చర్స్)

బాలకృష్ణ గుడివాడ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తన తండ్రి పుట్టిన గ్రామం నిమ్మకూరు ఇదే నియోజకవర్గంలో ఉండటంతో ఆయన దగ్గరుండి బాబు పాదయాత్ర కోసం అన్నీ సిద్ధం చేశారు. టిడిపి తరఫున ఎన్నికైన కొడాలి నాని ఇటీవలె జగన్ పార్టీలోకి వెళ్లడంతో బాలయ్య గుడివాడను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+