హాస్టల్‌లో యువతి ఆత్మహత్య, ఉద్యోగాల పేరుతో టోపీ

ఉద్యోగాల పేరుతో కుచ్చు టోపీ
ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఓ రిటైర్డ్ ఉద్యోగి నిరుద్యోగులను మోసగిస్తున్న ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. మైక్రో ఇరిగేషన్ పిడి వేణుగోపాల రావును తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వేణు పెద్దాపురం, అమలాపురం, కాకినాడకు చెందిన ఇరవై మంది నుండి దాదాపు నలభై లక్షళు వసూలు చేశాడు. తమకు ఉద్యోగాలు ఇప్పించ పోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇద్దరు మృతి
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో సోమవారం ఉదయం ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
విశాఖపట్నం జిల్లాలో ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికి అక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications