యాత్రలపై మళ్లీ జయప్రద: ఏ పార్టీయో ఇప్పుడే కాదు

పోటీ మాత్రం రాజమండ్రి చేస్తానని చెప్పారు. కొందరు నేతలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఎన్నో సమస్యల్లో ఉన్నారని.. వారిని వదిలేసి పార్టీలను నిలుపుకునేందుకు కొందరు పాదయాత్రలు చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. తాను ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తానన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి ఆమె కితాబిచ్చారు.
కాగా, జయప్రద పాదయాత్రల పైన నాలుగైదు నెలల క్రితం కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో పాదయాత్రల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వస్తున్నా మీకోసం పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర అక్టోబర్ 25న ప్రారంభించగా, మరో ప్రజా ప్రస్థానం పేరుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర ఈ నెల 18వ తేది నుండి ప్రారంభించారు.
దీనిపై విలేకరులు ప్రశ్నించగా అప్పుడు జయప్రద స్పందించారు. పాదయాత్రలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారాయని ఆమె అభిప్రాయపడ్డారు. పాదయాత్రలతో ఒరిగేదేమిటో ప్రజలే నిర్ణయిస్తారని ఆమె చెప్పారు. పాదయాత్రల వల్ల తమకు ఏమైనా లాభం జరుగుతుందా లేదా అని ప్రజలు నిర్ణయించుకోవాలని ఆమె సూచించారు.












Click it and Unblock the Notifications