డిఎస్పీ హత్య: మంత్రిగా రాజా భయ్య రాజీనామా

Raghuraj Pratap Singh
లక్నో: డిప్యూటీ డిఎస్పీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని డిప్యూటీ డిఎస్పీ సహా ముగ్గురి హత్యకు సంబంధించి రాజా భయ్యాపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మంత్రిపదవికి ఆనయ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కలిసి అందజేశారు.

రాజాభయ్యా రాజీనామాను ఆమోదించినట్లు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ చెప్పారు. తన భర్తను ఆదివారంనాడు దారుణంగా హత్య చేశారని, యుపి ఆహార, పౌరసరఫరాల మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా సూచన మేరకే తన భర్తను హత్య చేశారని కుందా డిఎస్పీ జియా వుల్ హక్ భార్య ఆరోపించారు.

రాజా భయ్యాపై, అతని అనుచురులు నలుగురిపై పోలీసులు హత్య, క్రిమినల్ కుట్ర కింద కేసులు నమోదు చేశారు. కుందాలో శనివారం రాత్రి జరిగిన హింసలో హక్ (30) హత్యకు గురయ్యారు. లక్నోకు కుందా 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

హక్ దేహం ఎడమ పక్కన 9ఎంఎం బుల్లెట్‌తో కాల్పులు జరిపినట్లు పోస్టుమార్టం నివేదికలో బయటపడింది. ఊపిరితిత్తులను ఆ బుల్లెట్ దెబ్బ తీసింది. హక్‌కు విధి నిర్వహణ కోసం 9ఎంఎం పిస్టల్ ఇచ్చారు. అతను మరణించినప్పటి నుంచి అది కనిపించకుండా పోయింది. హక్‌ను చంపడానికి ఆ పిస్టల్‌నే వాడినట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+