ఆస్పత్రిలో చేరిన ప్రియాంక గాంధీ: చిన్నపాటి శస్త్రచికిత్స
న్యూఢిల్లీ: ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ సోమవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో ఆమె చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. 41 ఏళ్ల ప్రియాంక గంగారామ్ ఆస్పత్రిలో పిత్తాశయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది.
ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే, ఆస్పత్రి నుంచి ఏ విధమైన అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. సోనియా గాంధీ, ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీ ఆమెను ఆస్పత్రిలో పరామర్శించారు.

ప్రియాంక బాగుందని రాహుల్ గాంధీ మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎలా ఉందని మీడియా ప్రతినిధులు అడిగితే ఆయన అలా అన్నారు. అంతకు మించి వివరాలు చెప్పలేదు.












Click it and Unblock the Notifications