జంటపేలుళ్లు: 48మంది మృతి, 150మందికి గాయాలు

48 killed, over 150 wounded in Karachi bombings
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఆదివారం రాత్రి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కరాచీలో జరిగిన జంట పేలుళ్లలో దాదాపు 48 మంది మృతి చెందారు. షియాల ప్రాబల్యం ఉన్న కరాచీ నగరం బాంబులతో దద్దరిల్లింది. 150 మంది గాయపడ్డారని తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో అబ్బాస్‌లోని ఇమాంబర్గా(షియాల ప్రార్థనా మందిరం) వెలుపల తొలి బాంబు పేలింది.

ప్రార్థనలు ముగించుకొని తిరిగి వెళుతున్న సమయంలో పేలుడు సంభవించింది. కారులో పేలుడు పదార్థాలు ఉంచి పేల్చివేసినట్టు తెలుస్తోంది. అనంతరం పదినిమిషాలకే అక్కడకు సమీపంలో రెండో పేలుడు సంభవించింది. క్షతగాత్రులను సమీపంలోని జిన్నా, అబ్బాసీ షహీద్ ఆస్పత్రులకు తరలించారు.

పేలుడు శబ్దాలు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికీ వినిపించాయి. పేలుళ్లకు కారణమంటూ ఏ ఉగ్రవాద సంస్థా ఇప్పటి వరకు ముందుకు రాలేదు. రెండోసారి పేలిన బాంబు తీవ్రత ఎక్కువగా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇది మానవ బాంబుగా తెలుస్తోంది. ఘటనస్థలం నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు.

మిగిలిన వారి మృతదైహాలు ముక్కలయ్యాయి. ఇవి గుర్తు పట్టేందుకు వీలు లేకుండా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దాదాపు 150 కిలోల పేలుడు పదార్థాలు వినియోగించి ఉంటారని ఫయ్యాజ్ అనే అతను చెబుతున్నాడు. ఈ పేలుళ్ల దాటికి 150 వరకు దుకాణాలు దగ్ధమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+