జగన్‌పార్టీలోకి నటుడు నరేష్: ఎమ్మెల్సీకోసం తేలని లెక్క

ఎమ్మెల్సీ బరిలోకి జగన్ పార్టీ
ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి నిలిపి గెలిపించుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇతర పార్టీల వైఖరి చూశాక, పోటీలో ఒకరిని నిలపాలా, ఇద్దరిని నిలపాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో బాలినేని అధ్యక్షతన పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చించారు. అనంతరం బాలినేని విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ సహా ఏ పార్టీ మద్దతూ కోరబోమన్నారు. తమ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో జగన్ రెండు రోజుల్లో నిర్ణయించి చెబుతారన్నారు.
హాజరైన టిడిపి, కాంగ్రెసు ఎమ్మెల్యేలు
పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ లేకుండానే ఈ సమావేశం జరిగింది. ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేలు తానేటి వనిత, శిరియా సాయిరాజ్, రాజేష్, పేర్ని నాని, గొట్టిపాటి రవి కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామంటే తమ పార్టీలో చేరేందుకు కాంగ్రెస్, టిడిపిలకు చెందిన 50 మంది నేతలు సిద్ధంగా ఉన్నారని, వారిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని బాలినేని తెలిపారు.












Click it and Unblock the Notifications