హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వ్యూహం: అవిశ్వాసంతో కిరణ్, బాబులకు చిక్కులు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వచ్చే శానససభ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యూహంలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డినే కాకుండా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని చిక్కుల్లో పడేసేందుకు అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని ప్రయోగించాలని ఆ పార్టీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తూ వస్తున్నామని, చంద్రబాబు అవిశ్వాసం ప్రతిపాదించకపోతే తాము ప్రతిపాదించడానికి ముందుకు వస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు. అధికార కాంగ్రెసు పార్టీకి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్న అపవిత్రమైన అవగాహనను బట్టబయలు చేయడానికి తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించదలుచుకున్నట్లు వారు చెబుతున్నారు.

విద్యుత్ రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని తెలుగుదేశం పార్టీని తాము డిమాండ్ చేస్తామని, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తుందని, తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించకపోతే తాము ప్రతిపాదించే ఆలోచన చేస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రస్తుతం 17 మంది శాసనసభ్యులు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రావాలంటే కనీసం 30 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే తమకు అంతకన్నా ఎక్కువ బలం ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి వంటి వైయస్సార్ కాంగ్రెసు నాయకులు అంటున్నారు.

English summary
Even as the government is gearing up for the budget session slated to start on March 13, YSR Congress is devising a strategy to corner both ruling Congress and principal opposition party TDP in the Legislative Assembly by moving a no-confidence motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X