విజయమ్మ వాకిట్లో: బాబు నోట లోకేష్ సెటైర్స్(పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వస్తున్నా మీకోసం పాదయాత్రలో అధికార కాంగ్రెసుతో పాటు వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిపై వినూత్న వ్యాఖ్యలు చేసి ఆకట్టుకున్నారు. షెడ్యూల్ ప్రకారం బాబు యాత్ర మొదట జనవరి 26న ముగియాల్సినప్పటికీ పలు కారణాలతో చలాకీగా కొనసాగిస్తున్నారు. తన నూటా యాభై రోజుల పాదయాత్రలో బాబు ఇతర పార్టీలపై ఆసక్తికరమైన విమర్శలు చేశారు.

బాబు చేసిన పలు కామెంట్‌లు ఆయన తనయుడు నారా లోకేష్ సూచించినవే అనే ప్రచారం జరిగింది. 2009లో టిడిపి నగదు బదలీ పథకం ప్లాన్ నారా లోకేష్‌దేనని టిడిపి నేతలు చెబుతుంటారు. ఇప్పుడు పాదయాత్రలో ప్రజలను ఆకట్టుకునేలా విమర్శనాత్మక వ్యాఖ్యలను కూడా కొన్నింటిని లోకేష్ తన తండ్రికి సూచిస్తున్నారట. మరికొన్నింటిని బాబు మాట్లాడుతూ మాట్లాడుతూ చేసినవి కూడా ఉన్నాయి.

బాబు తన పాదయాత్రలో అధికార కాంగ్రెసు పార్టీని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావులతో పాటు జాతీయ నేతలను కూడా టార్గెట్ చేసుకున్నారు. ఇక ఆయా నియోజకవర్గాలలో స్థానిక సమస్యలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల వైఫల్యాన్ని ఎత్తి చూపారు.

విజయమ్మ వాకిట్లో: బాబు నోట లోకేష్ సెటైర్స్(పిక్చర్స్)

చంద్రబాబు తన పాదయాత్రలో విపక్షాలపై ఆకట్టుకునే విమర్శలు చేస్తున్నారు. అందులో నారా లోకేష్ సూచించినవి కూడా ఉన్నాయట.

విజయమ్మ వాకిట్లో: బాబు నోట లోకేష్ సెటైర్స్(పిక్చర్స్)

వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్ అవినీతిపరులు అని ఆరోపిస్తూ... జగన్ వద్ద ఉన్న డబ్బు అంటూ బాబు సంచులు, లారీలు అంటూ సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. జగన్ వద్దకు వెళ్లాలంటే జైలుకు వెళ్లి దండం పెట్టుకోవాలని కామెంట్స్ చేశారు. తనకు అవినీతితో పెట్టిన పత్రికలు, ఛానళ్లు లేవని చెప్పారు.

విజయమ్మ వాకిట్లో: బాబు నోట లోకేష్ సెటైర్స్(పిక్చర్స్)

విజయమ్మ తన భర్త, కొడుకు అవినీతిని మొగ్గలోనే తుంచేయాల్సి ఉండెనని సూచించడంతో పాటు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చిన సమయంలో విజయమ్మ వాకిట్లో అవినీతి చెట్టు అని విమర్శించారు.

విజయమ్మ వాకిట్లో: బాబు నోట లోకేష్ సెటైర్స్(పిక్చర్స్)

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కిరి కిరి రెడ్డిగా, బొత్సను మద్యం డాన్‌గా అభివర్ణించారు.

విజయమ్మ వాకిట్లో: బాబు నోట లోకేష్ సెటైర్స్(పిక్చర్స్)

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను పిల్ల కాంగ్రెసు, తల్లి కాంగ్రెసు, తల్లి పాము పిల్ల పాములుగా అభివర్ణించారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఉన్నది కాంగ్రెసు(ఐ) అయితే.. జగన్ స్థాపించిన పార్టీ వైయస్సార్ కాంగ్రెసు కాదని కాంగ్రెసు(వై) అన్నారు.

విజయమ్మ వాకిట్లో: బాబు నోట లోకేష్ సెటైర్స్(పిక్చర్స్)

వైయస్ నంద్యాలలో తెలంగాణకు వెళ్లాలంటే వీసా, పాసుపోర్ట్ ఉండాలా అని అనకపోతే టిడిపి అధికారంలోకి వచ్చి ఉండేదని వివరించే ప్రయత్నం చేశారు.

విజయమ్మ వాకిట్లో: బాబు నోట లోకేష్ సెటైర్స్(పిక్చర్స్)

తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూనే.. కెసిఆర్ టిడిపి కారణంగానే ఈ స్థాయికి ఎదిగారంటూ పదవి ఇస్తే పార్టీ పెట్టక పోయి ఉండేవారని ఆరోపించారు.

విజయమ్మ వాకిట్లో: బాబు నోట లోకేష్ సెటైర్స్(పిక్చర్స్)

విపక్షాలపై విమర్శలతో పాటు పార్టీ కార్యకర్తలకు ఇటీవల ఓ సూచన చేశారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు.. నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివ్వనని చెప్పేవారు. దీనిపై స్పందిస్తూ... తన వ్యాఖ్యలపై వ్యతిరేక ప్రచారం జరిగిందని చెబుతూ.. ఇక నుండి ఎంత సేపు నిద్రపోతారో పొండి ఆ తర్వాత అందరం కలిసి పని చేద్దామంటూ సూచించారు.

విజయమ్మ వాకిట్లో: బాబు నోట లోకేష్ సెటైర్స్(పిక్చర్స్)

సామాజిక న్యాయం పేరుతో వచ్చిన చిరంజీవి కాంగ్రెసుకు అమ్ముడుపోయారని ఆరోపిస్తూ జగన్ కూడా చిరంజీవిలాగే తన పార్టీని కాంగ్రెసులో కలిపేస్తారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+