కుటుంబసపరివార దోపిడీ, రాష్ట్రం బలి: వైఎస్‌పై సోమిరెడ్డి

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం రాష్ట్రం మొత్తం బలయిపోయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైయస్, ఆయన కుటుంబ సభ్యులు వైయస్ విజయమ్మ, వైయస్ జగన్, షర్మిల, అనిల్ కుమార్, మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, విజయ సాయి రెడ్డి తదితర పన్నెండు మంది ఆస్తులు నిలువునా పెరిగిపోయాయని ఆరోపించారు.

ఒక్క జగన్ ఆస్తులపై విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి రావన్నారు. వైయస్ హయాంలో వేల కోట్ల ఆస్తులు సంపాదించిన ఆ పన్నెండు మంది ఆస్తుల పైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైయస్ సకుటుంబ సపరివారతంగా దోపిడీ చేసిందన్నారు. వైయస్ కుటుంబ సభ్యుల బినామీల్లో ప్రాణభయం మొదలైందన్నారు. వైయస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ బినామీ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్న వీరభద్రా రెడ్డి అనుమానాస్పద మృతి మిగిలిన బినామీల్లోనూ భయం రేకెత్తించిందని తెలిపింది.

బినామీల్లో వీరభద్రా రెడ్డిది తొలి మరణమని, ఇలాంటివి మున్ముందు మరిన్ని చోటు చేసుకున్నా అశ్చర్యపోనక్కరలేదన్నారు. బ్రదర్ అనిల్‌కు ఇనుప ఖనిజం వ్యాపారి కొండలరావు బినామీ అని, ఈ కొండల రావుకు వీరభద్రా రెడ్డి బినామీ అని ఆరోపించారు. వీరభద్రా రెడ్డి తన ఆత్మహత్య లేఖలో తన ఆస్తుల వివరాలను పేర్కొంటూ, వాటిని కొండల రావు పేరు మీదకు మార్చాలని కోరారని, ఆ లేఖ ఇప్పుడు పోలీసుల వద్దే ఉందన్నారు.

బెనెటా ఇండస్ట్రీస్‌కు కొండల రావు ఎండిగా ఉన్నారని, ఆయన భార్య రమాదేవి మిరాకిల్ ఫార్ములేషన్స్‌కు ఎండి అని, బ్రదర్ అనిల్ రక్షణ స్టీల్స్‌కు ఎండి అని ఈ మూడు కంపెనీలు హైదరాబాద్‌లో ఆదిత్యా ఎలైట్‌లో ఒకే చిరునామాలో పని చేస్తున్నాయన్నారు. వీరభద్రా రెడ్డి మరణంతో వైయస్ కుటుంబ ఆస్తులకు బినామీలుగా ఉన్న వారందరికీ ప్రాణభయం ఏర్పడిందని, వారికి రక్షణ కల్పిస్తే ఆ ఆస్తుల వివరాలన్నీ బయటకొస్తాయన్నారు. వీరభద్రా రెడ్డి మరణంపై మరింత సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రాన్ని దోచుకోవడం వైయస్ హయాంలోనే ప్రజలు చూశారన్నారు. వైయస్ దోచుకోమని బంధుగణాన్ని రాష్ట్రం పైకి వదిలేశారన్నారు. 2004కు ముందు అప్పుల్లో ఉన్న వైయస్, ఆయన బంధువులు ఇప్పుడు వేల కోట్ల ఆస్తిపరులుగా మారారు. వారి ఐటీ లెక్కలు చూస్తే విషయం తేలిపోతుందన్నారు. వైయస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలుకాగా... ఆయన కుటుంబం మాత్రం దేశంలోనే అత్యంత సంపన్న మైనదిగా మారిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+