వచ్చే నెలలోనే వైయస్ జగన్ బయటకు వస్తారా!?

అప్పటిలోగా సిబిఐ తుది ఛార్జీషీటు దాఖలు చేయకుంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని సుప్రీం గతంలో చెప్పింది. దీనిపై సిబిఐ వాదన మరోలా ఉంది. తమకు నిర్దిష్ట సమయం లేదని చెప్పింది. కానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ క్యాడర్ మాత్రం జగన్ బయటకు వస్తారనే ఆశతో ఉంది. దర్యాఫ్తు పూర్తి కాని పక్షంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చుననే సుప్రీం సూచనల మేరకు పిటిషన్ దాఖలు చేస్తే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఉత్సాహంలో ఉన్నారట.
గతంలో నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో, హైకోర్టులో, సుప్రీం కోర్టులలో బెయిల్ పిటిషన్ పైన తీర్పు వచ్చే సమయంలో ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు జగన్‌కు బెయిల్ ఖచ్చితంగా వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ, పలుమార్లు చుక్కెదురయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ ఎప్పుడు జైలు నుండి వస్తారో? అని విమర్శిస్తుంటే.. వచ్చే నెల వారికి షాక్ తప్పదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కౌంటర్ ఇస్తోంది. అంటే ఏప్రిల్‌లో తప్పనిసరిగా జగన్ విడుదలవుతారనే అభిప్రాయంతో ఆ పార్టీ ఉన్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications