మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హాల్ టిక్కెట్ ఇవ్వలేదని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajahmundry
మెదక్/రాజమండ్రి: మెదక్ జిల్లాలో హాల్ టిక్కెట్ ఇవ్వలేదనే మనస్థాపంతో ఇంటర్మీడియేట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని ఆందోల్ మండలంలోని సంగుపేట గ్రామంలో సాయిలు అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాల్ టిక్కెట్ ఇవ్వలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి ఆరోపించారు. జోగిపేటలోని క్రాంతి జూనియర్ కళాశాలలో సాయిలు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఫీజు కట్టలేదని యాజమాన్యం హాల్ టిక్కెట్ ఇవ్వలేదు.

అగ్ని ప్రమాదం

తూర్పు గోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. కాకినాడలోని స్వామి నగర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో దాదాపు వంద గుడిసెల వరకు బూడిదయ్యాయని సమాచారం. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇది జరిగి ఉంటుందని చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరగడంతో పలు ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్లు ఉండటంతో అందరూ ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టారు. అగ్నిమాపక దళాలు వచ్చి మంటలను ఆర్పుతున్నాయి.

మావోయిస్టు పోస్టర్లు

నల్గొండ జిల్లాలోని దేవరకొండలో మావోయిస్టు పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. చందంపేట మండలం రేకులగడ్డలో ఆర్టీసీ బస్సుకు పీపుల్స్‌గెరిల్లా ఆర్మీ పేరుతో మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. అధికార పార్టీ నేతలు, ఇన్‌ఫార్మర్లను మావోయిస్టులు హెచ్చరించారు. పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించుకుందామని, యూరేనియంను కాపాడుకుందామని పోస్టర్లలో మావోయిస్టులు పిలుపునిచ్చారు.

టిడిపి వర్సెస్ జగన్ పార్టీ

జిల్లాలోని పెద్దపప్పూరు మండలం ఇన్న యక్కూరులో బుధవారం ఉదయం టిడిపి-వైయస్సార్ కాంగ్రెసు కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ దాడుల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.

English summary
An intermediate student was committed suicide on Wednesday in Medak district for not receiving hall ticket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X