చిత్తూరులో మందుపాతరల కలకలం: అత్యాచారయత్నం

చిన్నారిపై అత్యాచారయత్నం
ఏడేళ్ల చిన్నారి పైన కర్నూలు జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఎమ్మిగనూరు ఎన్టీఆర్ నగర్‌లో ఓ ఆటో డ్రైవర్ ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేయడంతో ఆమె కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడకు చేరుకొని డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలికను ఆసుపత్రికి తరలించారు.
ఆధార కేంద్రం వద్ద తొక్కిసలాట
హైదరాబాదులోని శంషాబాద్ ఆధార్ కేంద్రం వద్ద బుధవారం మధ్యాహ్నం తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఆధార్ నమోదు కేంద్రం రద్దీ అధికంగా ఉండటంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో కొందరు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు.
గంజాయి స్వాధీనం
తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలం వేమనపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా తరలిస్తున్న 13 బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications