వన్ సైడ్ లవ్: అశ్లీల ఎస్సెమ్మెస్‌లతో ఎన్నారై వేధింపు

ఆన్‌లైన్ చాటింగ్‌లో ఎమ్మెస్సీ చదువుతున్న సదరు యువతితో పరిచయం అయింది. చిన్ననాటి క్లాస్‌మేట్‌గా ఇద్దరి మధ్య సఖ్యత పెరిగింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికొచ్చిన అతను నెల రోజుల క్రితం భారత్‌కు వచ్చాడు. తన స్వస్థలం కరీంనగర్ నుంచి తరచూ హన్మకొండకు వచ్చి పెళ్లి చేసుకోవాలని ఆమెను కోరాడు. తన తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఆమె చెప్పింది. దీంతో కోపం పెంచుకున్న అతను ఆమెకు అశ్లీల ఎస్సెమ్మెస్‌లు పంపించాడు.
అంతేకాకుండా ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు గురి చేశాడు. ఈ క్రమంలో ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించాడు. అతని ఆగడాలను తట్టుకోలేని యువతి తండ్రి సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు కరీంనగర్‌కు వెళ్లి అతనిని మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
ప్రజాభిప్రాయ సేకరణకు అడ్డు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం సిద్ధవరంలో తోళ్ల పరిశ్రమ ఏర్పాటుపై అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పరిశ్రమను వ్యతిరేకిస్తున్న గ్రామస్థులు అధికారులను అడ్డుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications