జగన్ ప్యాకేజీల పుట్ట, బేరాలకు జైలుకు..: చంద్రబాబు

Chandrababu Naidu
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై తెలుగుదేసం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ అంటేనే ప్యాకేజీల పుట్ట అని ఆయన అన్నారు. చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్ వద్దకు బేరాలు కుదుర్చుకోవడానికే వెళుతున్నారని, ఆ పని కాగానే ఫిరాయిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కృష్ణాజిల్లా గుడివాడ మండలం గాంధీ ఆశ్రమం వద్ద మంగళవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. రామనపూడి, చిన ఎరికపూడి, గుడివాడ పట్టణం మీదుగా 14.5 కిలోమీటర్లు నడిచారు. అనంతరం గుడివాడలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.

జగన్ ప్యాకేజీలతో రాజకీయ విలువలు పతనమవుతున్నాయని, పార్టీ మారేందుకు ముందుకొచ్చిన వారికి సూట్‌కేసుల ద్వారా కోట్లు ముట్టచెబుతున్నారని, ఆ డబ్బులకు ఆశపడే ఫిరాయింపుదారులు చంచల్‌గూడ జైలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో సంబంధం ఉంటోందని ఆయన అన్నారు.

బ్రదర్ అనిల్‌ను నమ్ముకున్న వారికి ప్రాణాలు మిగిలే పరిస్థితి కూడా లేదని అంటూ చంద్రబాబు కడపలో వీరభద్రారెడ్డి అనుమానస్పద మృతిని పరోక్షంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ ఘనతగా చెప్పుకొంటున్న రైతు రుణమాఫీలో అవినీతి జరిగిందని 'కాగ్' తేల్చిందని గుర్తుచేశారు. భావి తరాల భవిష్యత్ కోసం ఆరాట పడుతున్నానని, నిద్రలో కూడా ప్రజా సమస్యలే గుర్తుకు వస్తున్నాయనిఅన్నారు.

పాదయాత్ర వల్ల తనకు తెలియకుండానే తనలో మార్పు వచ్చిందని, ప్రజలకు ఏమి చేయాలన్న యాక్షన్ ప్లాన్ మైండ్‌లో రూపుదిద్దుకుంటోందన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తాను బాంబులకే భయపడలేదంటూ 'అలిపిరి' ఘటనను గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+