వివిఐపి హెలికాప్టర్ స్కామ్: త్యాగిని ప్రశ్నించిన సిబిఐ

త్యాగి బుధవారం సాయంత్రం 3 గంటలకు సిబిఐ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. త్యాగిని సిబిఐ అధికారులు రెండు గంటల పాటు విచారించారు. ఆయన సమీప బంధువులు జాలీ, డోక్సాలపై సిబిఐ అధికారులు తొలుత ప్రశ్నల వర్షం కురిపించారు.
హెలికాప్టర్ల ఒప్పందం 2010లో జరిగింది. తాను ఏ విధమైన తప్పు కూడా చేయలేదని త్యాగి చెప్పారు. త్యాగి, ఆయన సమీప బంధువులు జాలీ, రాజీవ్, డోక్సాలకు ఈ ఒప్పందంతో సంబంధం ఉందని సిబిఐ ఆరోపిస్తోంది. ప్రాథమిక విచారణలో సాక్ష్యాధారాలు లభించాయని కూడా అంటోంది.
ఫిస్‌మెకానికా సిఇవో అరెస్టు సందర్భంలో ఇటలీ న్యాయవాదుల విచారణలో త్యాగి బంధువుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు చెందిన 12 వివిఐపి చాపర్ల కొనుగోలు చేసేందుకు గెరోసా, హెస్చ్కే లంచాలు ఇచ్చినట్లు ఇటలీ దర్యాప్తు ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications