విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రాప్‌లో పడొద్దు: నేతలకు బాబు, పెళ్లి.. కాపురమంటూ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విజయవాడ: ప్రభుత్వం ట్రాప్‌లో పడకుండా అసెంబ్లీలో చాకచక్యంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం పార్టీ నేతలకు సూచించారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర కొనసాగుతున్న కృష్ణా జిల్లాలో టిడిఎల్పీ భేటీ అయింది. జిల్లాలోని ముదినేపల్లి మండలం దాకారంలో బాబు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి అందుబాటులో ఉన్న యాభై మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు వారికి పలు సూచనలు చేశారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ట్రాప్‌లో పడకుండా వ్యవహరించాలని సూచించారు. ఈ ఏడాది ఎన్నికల ఏడాది కాబట్టి అసెంబ్లీలో మనదే పైచేయి కావాలని బాబు ఎమ్మెల్యేలకు సూచించారు. ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మొహమాటం లేకుండా ప్రభుత్వాన్ని సమస్యల విషయంలో నిలదీయాలని సూచించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్, విద్యుత్ సమస్యలు, బాంబు పేలుళ్ల సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని సూచించారు. అసెంబ్లీలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెసు మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. వీరభద్రా రెడ్డి మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేయాలని సూచించారు.

అనిల్ కుమార్ ఏ భార్యపై ప్రమాణం చేస్తారో డిమాండ్ చేయాలని సూచించారు. కొందరు ఎమ్మెల్యేల తీరు తాళి కట్టేది ఒకరితో కాపురం మరొకరితో అన్నట్లుగా ఉందని, వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని, వారు ప్రజలచే తిరస్కరించబడతారన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ పార్టీ కాంగ్రెసుకు మద్దతు పలికిందని గుర్తు చేశారు. అవిశ్వాసం పెడితే వారు ప్రభుత్వాన్ని కూల్చుతారనే నమ్మకం లేదని, ఆ పార్టీయే అవిశ్వాసం పెడితే డ్రామాలు ఎవరివో తెలుస్తాయన్నారు. ఎపిని కలుపుకునే కేంద్రం ఎన్నికలకు పోతుందన్నారు.

ఈ సమావేశం రెండున్నర గంటల పాటు సాగింది. శాసనమండలిలో, శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై బాబు వారికి దిశానిర్దేశనం చేశారు. కాగా, సమావేశం అనంతరం పార్టీ నేతలు మాట్లాడుతూ... బ్రదర్ అనిల్ కుమార్ అంశానికి సంబంధించి వీరభద్రా రెడ్డి మరణంపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎవరో పెట్టమంటే తాము అవిశ్వాం పెట్టమని ప్రజల కోసం పెడతామన్నారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu has suggested MLA on Thursday in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X