వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపి చింతామోహన్ పొగడ్త: సోనియా గాంధీ ఇబ్బంది!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chinta Mohan-Sonia Gandhi
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ తిరుపతి పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన ప్రశంసలు కురిపించారు. అయితే, తనపై చింతా మోహన్ ప్రశంసలకు సోనియా కొద్దిగా ఇబ్బందులకు గురైనట్లుగా ఆమె హావభావాలు కనిపించాయి. సోనియా చొరవ కారణంగా కాంగ్రెసు ప్రభుత్వం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తోందని, అన్ని పథకాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని, పథకాలు అన్ని విజయవంతంగా అమలు అవుతున్నాయని, ఇందుకు సోనియా గాంధీయే కారణమని చింతా మోహన్ చెప్పారు.

ఆయన సోనియాను అదే పనిగా పొగుడుతుండటంతో సోనియా కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయినట్లు కనిపించారు! కేవలం పథకాలు, వర్గాలు ప్రశంసలతోనే ఆయన సరిపెట్టలేదు. సోనియా నేతృత్వంలో మైనార్టీ సిక్ వర్గానికి చెందిన మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారని, అరవై అయిదేళ్ల తర్వాత ఓ దళిత నేత లీడర్ ఆఫ్ హౌస్ అయ్యారని సోనియాను ప్రశంసలతో ముంచెత్తారు. అదే పనిగా పొగుడుతుండటంతో సోనియా అన్ కంపోర్ట్‌గా ఫీలయ్యారట.

బుధవారం లోకసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన జరిగిన చర్చలో చింతా మోహన్ మాట్లాడారు. యూపిఏ ప్రభుత్వం పేదలకు తాగడానికి ఓ వైపు పాలు ఇస్తూనే మరోవైపు విషం కూడా అందిస్తోందని మద్యం విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు కూడా చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల పేదలకు రోజుకు రూ.200 నుంచి రూ.300 వేతనం లభిస్తోందన్నారు.

ఓ వైపు సంక్షేమ పథకాలు అందిస్తూనే చౌకబారు మద్యం పేదలకు చేరువయ్యేలా చేస్తున్నారని ఆక్షేపించారు. దీనివల్ల ఎపిలో మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటో తరగతి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాద్యమంలో బోధన ప్రవేశ పెట్టాలని కోరారు.

English summary
Congress MP Chinta Mohan heaped praise on his party Chief Sonia Gandhi by giving credit to her for all the government schemes for various sections of the society and maintained that these were running successfully under her able leadership. At this Gandhi made some gestures to show her discomfiture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X