బాబు రాకుంటే మోత్కుపల్లి: షర్మిల ఆస్తులపై యనమల

చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయన సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కీలక సందర్భాలలో తప్పితే ఆయన సభకు హాజరు కాకపోవచ్చు. దీంతో తాను లేని సమయంలో తన బాధ్యతలను మోత్కుపల్లి చూస్తారని బాబు ఎమ్మెల్యేలకు సూచించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బాబు ఎక్కువ రోజులు ప్రజల్లోనే ఉండనున్నందున మోత్కుపల్లియే చూసుకునే అవకాశాలు ఉన్నాయి.
జగన్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు
కాగా, భేటీ అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ... వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయ, ఆర్థిక లబ్ధి కోసమే అవిశ్వాసం అంటూ నిత్యం జపం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత వల్ల బాంబు పేలుళ్లు, విద్యుత్ కొరత తలెత్తాయన్నారు. అవిశ్వాసంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ నుండి వెళ్లిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
అనిల్, షర్మిల ఆస్తులపై విచారణ జరపాలి
బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల ఆస్తుల పైన విచారణ జరపాలని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హైదరాబాదులో డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అక్రమాలకపై సిబిఐ చేస్తున్న దర్యాఫ్తును అనిల్, షర్మిలలకు కూడా వర్తింప చేయాలన్నారు. తనకు పదకొండు సంస్థలు ఉన్నాయని, అందులో మూడు బాగా పని చేస్తున్నాయని అనిల్ స్వయంగా ప్రకటించారన్నారు. వైయస్ అధికారంలోకి రాకముందు, తర్వాత వారి ఆస్తులు వివరాలు పరిశీలించాలన్నారు.












Click it and Unblock the Notifications