జగన్ ప్లాన్: బరిలో టిడిపి మాజీ, సీటుపై కెసిఆర్ ధీమా

ఆదిరెడ్డి అప్పారావు దివంగత శ్రీకాకుళం జిల్లా నేత కింజారపు ఎర్రన్నాయుడుకు బంధువు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అతని సీనియారిటీతో పాటు రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తారనే ఉద్దేశ్యంతో ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. గతంలో టిడిపిలో పని చేసినందున ఆయనకు స్థానికంగా మంచి పట్టు ఉంది. దీంతో తాము లబ్ధి పొందడంతో పాటు టిడిపిని దెబ్బతీయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందనే భావనతో జగన్ పార్టీ ఆయనను నిలిపినట్లుగా చెబుతున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మైనార్టీ నేత మహమ్మద్ అలీని మండలి అభ్యర్థిగా ప్రకటించారు. అలీ తెరాస మైనార్టీ వింగ్ చైర్మన్. ఇతను ఈ రోజు తెరాస తరఫున నామినేషన్ దాఖలు చేయనున్నారు. మహమ్మద్ అలీ రెండేళ్ల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగు ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు ఎమ్మెల్యేలను తెరాస సస్పెండ్ చేసి ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి తీసుకుంది.
జగన్ పార్టీ, తెరాస ఒక్కో ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకోవచ్చుని భావిస్తున్నాయి. క్రాస్ ఓటింగు అందుకు ఉపయోగపడుతుందని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 21న జరుగనున్నాయి. నామినేషన్‌లు 4వ తేది నుండి ప్రారంభమయ్యాయి. మార్చి 9న ముగుస్తుంది.












Click it and Unblock the Notifications