Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేను సైతం: అజహరుద్దీన్‌పై పోటీకి అసదుద్దీన్ సై

Asaduddin Owaisi - Azharuddin
హైదరాబాద్/న్యూఢిల్లీ: మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ భారత క్రికెట్ మాజీ సారథి, ఎంపి అజహరుద్దీన్ పైన పోటీకి సై అంటున్నారు! ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడిన అసద్... అజహరుద్దీన్ హైదరాబాదు నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలపై స్పందించారు.

తనపై పోటీ చేసే ఇతర పార్టీల అభ్యర్థిని తాను ఎంపిక చేయనని, మనది ప్రజాస్వామ్య దేశమని, మన పైన ఎవరైనా పోటీ చేసే హక్కుందన్నారు. ఏవరైనా ఎక్కడి నుండైనా పోటీ చేయవచ్చునని చెప్పారు. అజహరుద్దీన్ హైదరాబాదు నుండి పోటీ చేసినా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

మహమ్మద్ అజహరుద్దీన్ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అనంతరం ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఆయనపై బ్యాన్ ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అజహరుద్దీన్‌కు అసద్ మద్దతు ప్రకటించారు. దానిని స్వాగతించారు. ఇప్పుడు వారిద్దరే హైదరాబాదు ఎంపిగా పోటీకి సై అంటున్నారు.

శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన అనంతరం అజహరుద్దీన్ మాట్లాడుతూ... తనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తి ఉందని, అధిష్టానం ఆదేశిస్తే హైదారాబాదు నుండి పోటీ చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులను అజహరుద్దీన్ పొగిడారు. ఆదేశిస్తే హైదరాబాదు నుండి పోటీ చేస్తానని అజహరుద్దీన్ చెప్పడంతో రాజకీయంగా ఈ అంశానికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+