సోదరిని నరికి తలతో ఠాణాలో సోదరుడి సరెండర్

యువతి శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నేరాన్ని అంగీకరించిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. బారాబంకికి చెందిన 55 ఏళ్ల వ్యక్తితో తాజ్‌పూర్ గోబ్రహాకు చెందిన జబ్బార్ కూతురు మహ్రూన్ (20)కు సంబంధం కొనసాగుతోంది.
ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆ 55 ఏళ్ల వ్యక్తి శుక్రవారం వచ్చాడు. అతను వెళ్లిపోయిన తర్వాత మహ్రూన్ కుటుంబ సభ్యుల మధ్య ఆ సంఘటనపై తీవ్రమైన చర్చ జరిగింది. కోపంలో మహ్రూన్ సోదరుడు నాన్కీ ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. ఆమె తల నరికాడు.
ఆమె తలతో నాన్కీ పోలీసు స్టేషన్‌కు చేరుకుని నేరాన్ని అంగీకరించాడు. నాన్కీని పోలీసులు అరెస్టు చేశారు. తండ్రి ఫిర్యాదుతో నాన్కీపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications