హెలికాప్టర్‌లో సినీ స్టయిల్లో రేప్ నిందితుడి పరారీ

జమ్మూకు హెలికాప్టర్‌లో తరలించడానికి ముందు అతనికి 5వేల రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించారు. మంజకోట్‌లోని కాకోరాలో శుక్రవారంనాడు పర్వేజ్ (25) ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కాండిలోని మనూర్గాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించడానికి జిల్లా అధికార యంత్రాంగం హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసింది.
ప్రత్యేక చికిత్స కోసం జమ్మూకు తరలించడానికి ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌లో అత్యాచారం కేసు నిందితుడు ఎక్కాడని, గాయపడినవారితో అతను ఎక్కాడని రాజౌరి - పూంచ్ రేంజ్ డిఐజి డానిష్ రాణా ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో చెప్పాడు.
ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. హెలికాప్టర్‌లో పారిపోవడానికి ఆస్పత్రి సిబ్బంది ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా విచారణ సాగుతుందని అంటున్నారు. అయితే, చివరకు అత్యాచారం కేసు నిందితుడిని పోలీసులు పట్టుకోగలిగారు.












Click it and Unblock the Notifications