అవిశ్వాసం: జగన్ ఓకే, చంద్రబాబు వ్యూహం ఏమిటి?

అయితే, అనూహ్యంగా తెరాస నుంచి అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన రావడంతో తెలుగుదేశం పార్టీ కంగు తిందని అంటారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తే ఓ తంటా, ఇవ్వకపోతే మరో తంటా అనే పరిస్థితిని తెలుగుదేశం పార్టీ ఎదుర్కుంటోంది. అందుకే, తెరాస వైయస్ జగన్ పార్టీతో కుమ్మక్కయి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తోందనే విమర్శను తెలుగుదేశం పార్టీ ముందుకు తెచ్చింది. పైగా మద్దతు తెలపడానికి వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలకు షరతులు కూడా పెడుతోంది. కాంగ్రెసు పార్టీతో కలవబోమని ప్రమాణాలు చేయాలనేది ఆ షరతు.
అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోయే స్థితి లేదని తెలుగుదేశం పార్టీ గట్టిగా చెబుతోంది. రాజీనామాలు చేసిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేసి కాంగ్రెసు అవిశ్వాస తీర్మానాన్ని గట్టెక్కుతుందని చెబుతోంది. అయితే, ప్రస్తుతం తెరాస ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలా, వద్దా అనే సంశయంలో పడింది. తెరాసకు 30 మంది సభ్యుల బలం లేదు కాబట్టి, ఆ పార్టీ ఇచ్చే అవిశ్వాస తీర్మానం నోటీసు చర్చకు అనుమతి పొందదని టిడిపి అనుకుంటూ వచ్చింది.
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడింది. దీంతో అవసరమైన బలాన్ని తెరాస వైయస్సార్ కాంగ్రెసు ద్వారా సమకూర్చుకోవడానికి ఏర్పాటు జరిగినట్లే చెప్పాల్సి ఉంటుంది. తాము అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ స్థితిలో ఎటువంటి వ్యూహం అనుసరించాలనే విషయంపై చంద్రబాబు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్లు చెబుతున్నారు.
ఇతర పార్టీలు ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే బదులు ప్రధాన ప్రతిపక్షంగా తామే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా పార్టీలో సాగుతోంది. ఏమైనా అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెసు ఓడిస్తే, వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలను నిందించాలనే వ్యూహం మాత్రం ఖరారైనట్లు తెలుస్తోంది. తాము చెప్పినా వినకుండా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారని, ప్రభుత్వాన్ని కాపాడడానికే తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయని విమర్శలు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం కూలిపోతే ఆ ఘనత తమదేనని చాటుకోవాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications