• search

బాబుకు షాక్: టిడిపికి పిఎల్ శ్రీనివాస్ రాజీనామా

By Pratap
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    PL srinivas
    హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎదురు దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పిఎల్ శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా విషయాన్ని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

    చంద్రబాబు వైఖరిని చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానాన్ని చంద్రబాబు వ్యతిరేకించడం దారుణమని ఆయన అన్నారు. తోకపార్టీలతోనే చంద్రబాబు 2009 ఎన్నికల్లో ప్రయోజనం పొందారని ఆయన అన్నారు. చంద్రబాబుపై తెలంగాణ మీద మాట్లాడడు, అవిశ్వాస తీర్మానంపై మాట్లాడడు అని ఆయన అన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

    చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకోవడం వల్లనే తెలంగాణ ఆగిందని ఆయన విమర్శించారు. పార్టీ కార్యకర్తలను వాడుకుని చంద్రబాబు వదిలేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోని చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారట అని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి, నడిపించారని ఆయన అన్నారు. నామ్ కే వాస్తేగా తనకు చంద్రబాబు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని ఆయన అన్నారు.

    తమ వర్గాన్ని చంద్రబాబు దూరం చేసుకుంటున్నారని ఆయన అ్నారు. ఆల్లాడి రాజ్‌కుమార్‌ను, శ్రీపతి రాజేశ్వర్‌ను కూడా చంద్రబాబు సరిగా వాడుకోవడం లేదని ఆయన అన్నారు. తమకు తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుగా మాట్లాడాలంటే తన వల్ల కాదని, అందుకే రాజీనామా చేస్తున్నానని ఆయన అన్నారు. సనత్‌నగర్ టికెట్ ఇచ్చి, ఉపసంహరించుకోవాలని చంద్రబాబు అడిగితే తాను ఉపసంహరించుకున్నానని, ఆలా ఉపసంహరించుకోనివారిని నియోజకవర్గాల ఇంచార్జీలుగా నియమించారని, తనను మాత్రం ఇంచార్జీగా నియమించలేదని ఆయన అన్నారు.

    అవిశ్వాస తీర్మానాన్ని చంద్రబాబు ప్రతిపాదించరని, ఇతరులు పెడితే మద్దతు ఇవ్వరని, ఇదేం పద్ధతి అని ఆయన అన్నారు. డబ్బులు ఇవ్వలేకపోయినందుకే తనకు ఇంచార్జీ పదవి ఇవ్వలేదని ఆయన అన్నారు. అవినీతిపరులు డబ్బులు ఇస్తున్నారని, వారికే పదవులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో మాట్లాడుతానని, కెసిఆర్‌కు మద్దతు ఇస్తానని ఆయన అన్నారు.

    సోదరులుగా విడిపోదామనేది తన ఉద్దేశ్యమని ఆయన అన్నారు. హైదరాబాదులో రాయలసీమ, ఆంధ్రవాళ్లు తక్కువ మందే ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు అగ్రనేతలు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిసి తాను సరైన సమచారాం ఇస్తానని, తప్పుడు సమాచారం అందిస్తున్నారని చెబుతానని ఆయన అన్నారు.

    English summary
    Telugudesam secretary PL srinivas has resigned drom the party opposing party president Nara Chandrababu naidu's stand on no confidence notion to be proposed by Telangana Rastra Samithi (TRS).

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more