Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పేరెంట్స్‌పై దాడి: పెళ్లికి లెక్చెరర్‌ను ఎత్తుకెళ్లిన విద్యార్థి

 Student kidnaps lecturer to marry
చెన్నై: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఓ ఇంజనీరింగ్ కళాశాల లెక్చెరర్‌ను అదే కళాశాలలో చదువుతున్న విద్యార్థి ఎత్తుకెళ్లాడు. దీనికి అడ్డుపడ్డిన యువతి తల్లిదండ్రులను కూడా కత్తితో గాయపరిచాడు. నలుగురు విద్యార్థులు ఆమెను ఎత్తుకెళ్లారు. ఆ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఆ విద్యార్థితో లెక్చెరర్‌కు మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు తెలుస్తోంది.

పెళ్లికి లెక్చెరర్ తల్లిదండ్రులు అంగీకిరంచడంతో ఆ విద్యార్థి తన మిత్రులతో కలిసి ఆ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కన్యాకుమారి జిల్లా కరుంగల్ సమీపంలోని ఎట్టణి అనే ప్రాంతానికి చెందిన అన్బయ్యన్ ఓ కూలీ కార్మికుడు. ఈయన కుమార్తె జాస్పిన్ సుజి (24) అనే పట్టభద్రురాలు నాగర్ కోయిల్‌లో ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది.

ఇదే కళాశాలలో తంగం పుదూర్ అనే ప్రాంతానికి చెందిన గౌతమ్ అనే 20 యేళ్ళ విద్యార్థి తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. గౌతమ్‌కు చదువులో సందేహం వచ్చినపుడల్లా లెక్చరర్ సుజి వద్దకు వెళ్లి సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉండేవాడు. ఇది వారిద్దరి మధ్య మరింత సన్నిహిత సంబంధాలకు దారితీసి, గత ఆరు నెలలుగా ప్రేమ వ్యవహారం సాగుతున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో సుజిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న గౌతం - గత వారం ఆమె ఇంటికి వెళ్లి వధువును ఇవ్వాల్సిందిగా కోరగా, అందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన గౌతమ్ తన స్నేహితులకు తన ప్రేమ వ్యవహారాన్ని వివరించాడు. వారంతా కలిసి టాటా సుమో కార్లలో ఇంటికి వచ్చి తనతో రావాల్సిందిగా కోరాడు. ఇందుకు సుజి నిరాకరించింది.

అంతేకాకుండా, తన కుమార్తె వద్దకు వెళుతున్న గౌతమ్‌ను యువతి తండ్రి అడ్డుకోవడంతో ఆగ్రహించిన గౌతమ్ అతనిపై దాడి చేసి గాయపరిచాడు. అలాగే, అడ్డుపడిన తల్లిని కూడా కత్తితో పొడిచి, లెక్చరర్ సుజిని కిడ్నాప్ చేసి.. పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. కత్తిపోట్లతో గాయపడిన సుజి తల్లిదండ్రులు నాగర్ కోయిల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

ఈ కిడ్నాప్ వ్యవహారంపై బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. విద్యార్థి గౌతమ్‌తో పాటు.. ఇతరులపై నాగర్ కోయిల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+