నేను నోరు విప్పితే అంతే: ధర్మాన, మేం చెప్పొద్దా: గాలి

విజయమ్మ చెప్పొచ్చు మేం చెప్పొద్దా?
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పొగుడుతూ మాట్లాడినప్పుడు ఆయన అవినీతిపై తాము మాట్లాడితే తప్పేంటని గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రశ్నించారు. వైయస్ అవినీతి వారసత్వంతో రాష్ట్రాన్ని పాలిస్తారా అని కిరణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కిరణ్ దొంగలను కాపాడుతున్నట్లుగా ఉందన్నారు. దోపిడీదారులపై చర్యలకు కిరణ్ వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు.
మైకులిసిరేస్తే తప్పు ఒప్పు కాదు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తమ నీతి, నిజాయితీ మాటలను జీర్ణించుకోలేక మైకులను విసిరి వేస్తున్నారని మోత్కుపల్లి విమర్శించారు. కొందరు పాపాత్ములు నిజాయితీ మాటలను భరించలేరన్నారు. అలాంటి వారి మనసును ఆ దేవుడు మార్చాలని కోరుకుంటున్నానని చెప్పారు.
మైకులు విసిరి వేసినంత మాత్రాన నిజాలు తప్పులు ఒప్పు కావన్నారు. అవినీతిపరుల నుండి సొమ్మును రికవరీ చేయాలన్నారు. కాంగ్రెసు పార్టీ హయాంలో ఖమ్మ జిల్లా గనులను వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్‌కు ఇచ్చారన్నారు. ఎంత చెప్పినా తరగని తప్పులను కాంగ్రెసు పార్టీ చేసిందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బాబ్లీపై రాష్ట్రానికి వ్యతిరేక తీర్పు వచ్చిందన్నారు.
పేలుళ్లపై కేంద్రం ముందే హెచ్చరించినా ఎందుకు అప్రమత్తం కాలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు విద్యుత్ ఉందా అని ప్రశ్నించారు. ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వం అన్నారు. కరెంట్ కోతలతో ఆపరేషన్లు మధ్యలోనే ఆగిపోతున్నాయని, వాటికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందని, అయినా రాజకీయ స్వలాభం కోసం పెట్టే అవిశ్వాసానికి తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదన్నారు.
విషయం లేదు
అవిశ్వాస తీర్మానంపై సరైన విషయంపై చర్చ సాగడం లేదని మంత్రి దానం నాగేందర్ అన్నారు. అవిశ్వాసం విషయంలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలకు ఎవరికీ విషయం లేదన్నారు.












Click it and Unblock the Notifications