హరీష్ చెప్పిన చిలుక కథ, మీదే వేదమా: శ్రీధర్ బాబు

Harish Rao - Sridhar Babu
హైదరాబాద్: అవిశ్వాస తీర్మానం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు తెలంగాణ విషయం మాట్లాడుతూ ఓ పిట్ట కథ చెప్పారు. ఓ వ్యక్తి చిలుకలు అమ్మే వ్యక్తి నుండి బాగా మాట్లాడుతుందని, బాగుంటుందని ఓ చిలుకను కొన్నారని, దానిని ఇంటికి తీసుకు వెళ్లాడని, ఆ తర్వాత బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన అతనికి భార్య మాంసాహారం వడ్డించిందని, ఎక్కడిది అని భర్త అడిగితే.. మీరు తెచ్చిన చిలుకను కోసి వండానని చెప్పిందని, మాట్లాడే చిలుకని ఎందుకు కోశావని అడిగితే.. తాను కోసిన సమయంలోనైనా అది చెప్పాలి కదా తాను మాట్లాడే చిలుకనని, తనను కోయవద్దని అని భార్య సమాధానం ఇచ్చిందని హరీష్ రావు చెప్పారు.

ఆ తర్వాత మాట్లాడూతూ.. ప్రస్తుతం తమ ప్రాంత కాంగ్రెసు పార్టీ ప్రజా ప్రతినిధుల పరిస్థితి అలాగే ఉందన్నారు. వారి నెత్తి మీద తెలంగాణ అనే కత్తి ఉన్నప్పటికీ స్పందించడం లేదని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో వారిపై తిరుగుబాటు తప్పదన్నారు. దానికి మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగానే స్పందించారు.

మీరు చెప్పిందే వేదమా?

తెరాస చెప్పిందే వేదమన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారని శ్రీధర్ బాబు అన్నారు. తాము కూడా తెలంగాణ ప్రాంతం నుండే వచ్చామని, ప్రజలు ఎన్నికుంటేనే వచ్చామని, తెలంగాణకు తాము చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. తమను కించపర్చే విధంగా మాట్లాడుతున్నారన్నారు.

తెలంగాణ నేతలమైన తమను కించపర్చినట్లుగా మాట్లాడితే తెలంగాణ ప్రజలను కించపర్చినట్లు కాదా అన్నారు. తమపై చిలుక కథలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మా మెడపై ఎలాంటి కత్తి లేదన్నారు. తమ పార్టీ నాయకత్వం తెలంగాణ ఇస్తుందనే ధీమాను శ్రీధర్ బాబు వ్యక్తం చేశారు. తెరాస చెప్పిందే వేదమన్నట్లుగా ఆ పార్టీ ప్రవర్తిస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+