మంత్రి పోస్ట్ తీసుకొండి.. వాత పెడ్తాం: దేవినేనికి కెటిఆర్

యూపిఏ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించింది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతలే అని ఆయన అన్నారు. తమ పార్టీ పైన అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇప్పించేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. తెరాస, జగన్ పార్టీల అజెండాలు అమలు చేసేందుకు తాము సిద్ధంగా లేమన్నారు.
కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో తమకు తెలుసునన్నారు. ఎప్పుడు కర్ర కాల్చి వాత పెట్టాలో తమకు తెలుసునని చెప్పారు. కాంగ్రెసుతో పొత్తు అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మనే స్వయంగా చెప్పారన్నారు. తెరాస అవిశ్వాస తీర్మానానికి జగన్ పార్టీకి మద్దతు పలుకుతున్న కాంగ్రెసు, టిడిపి రెబల్స్ ఎందుకు మద్దతు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు.
కాగా, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మీడియాను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి అన్నారు. రాజకీయం కోసం తెలంగాణవాదాన్ని తెరాస పక్కన పెట్టిందని ఆరోపించారు. తెరాస అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చే ప్రసక్తి లేదన్నారు.
మరోవైపు తెరాస అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చినప్పుడు వైయస్సార్ కాంగ్రెసు, లెఫ్ట్, బిజెపి, లోక్‌సత్తా, తెలంగాణ నగారా సమితి పార్టీలు మద్దతు ప్రకటించాయి. మజ్లిస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు మాత్రం మద్దతు పలుకలేదు.












Click it and Unblock the Notifications