టిడిపి మహిళా నేత కుమార్తె ప్రేమ వివాహం

Kavitha
హైదరాబాద్/కరీంనగర్: నాటి ప్రముఖ కథానాయిక, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కవిత కూతురు మాధురి ప్ర్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె ప్రేమ వివాహం కరీంనగర్ జిల్లాలో గురువారం జరిగింది. మాధురి వయస్సు 21. తన కారు డ్రైవర్ రాజ్ కుమార్‌ను ఆమె వివాహం చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రానికి చెందిన ఇరవయ్యెనిమిదేళ్ల రాజ్ కుమార్ మూడేళ్లుగా సికింద్రాబాదులో ఉంటూ మాధురి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

ఎంబిఏ చదువుతున్న మాధురిని కళాశాలకు తీసుకు వెళ్తున్న క్రమంగా ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. దళిత నేతల సమక్షంలో ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.

అనంతరం మాధురి మాట్లాడుతూ... తమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించరనే ఉద్దేశ్యంతోనే ఇక్కడకు వచ్చి పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి డిఎస్పీ లక్ష్మీ నారాయణష ఎస్సై రాజేంద్రప్రసాద్ అలయానికి వెళ్లి, దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మాధురి తప్పిపోయిందని ఫిర్యాదు

తమ కుమార్తె బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని కవిత భర్త, మాధురి తండ్రి దశరథ్ రాజ్ గురువారం హైదరాబాదులోని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఇంటికి సమీపంలో ఉన్న బంగారం తాకట్టు దుకాణంలో తన ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.83 వేలు తీసుకున్న మాధురి, తన కారును అక్కడే వదిలి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+