తెరాస అవిశ్వాసం: టిడిపి ఎమ్మెల్యే, జగన్‌పార్టీ మద్దతు

తెరాస అవిశ్వాసానికి మద్దతు పలికే వారిని నిలబడాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. తెరాస అవిశ్వాసానికి వైయస్సార్ కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ, సిపిఎం, సిపిఐ, లోక్‌సత్తా, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి తదితరులు మద్దతు పలికారు. 45 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో స్పీకర్ అవిశ్వాసంపై చర్చకు అనుమతి తెలిపారు. అనంతరం ఆయన సభను అరగంట పాటు వాయిదా వేశారు.
టిడిపి రెబల్ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి టిడిపి విప్ ధిక్కరించి తెరాస అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. కాగా తెరాసకు మద్దతు పలికిన వారు... తెలంగాణ రాష్ట్ర సమితి(18), వైయస్సార్ కాంగ్రెసు(17), బిజెపి(3), సిపిఐ(4), సిపిఎం(1), లోక్‌సత్తా(1), నాగం జనార్ధన్ రెడ్డి(1)లు మద్దతు ప్రకటించారు.












Click it and Unblock the Notifications