రేప్ తప్పించుకునేందుకు కిటికీలోంచి దూకిన బ్రిటిష్ గర్ల్

ఆమెను చికిత్స కోసం సమీప ఆసుపత్రిలో చేర్పించారు. బ్రిటిష్ మహిళ కిటికీ నుండి దూకడం వల్ల తీవ్ర గాయాలయ్యాయని ఆగ్రా పోలీసులు చెప్పారు. ముప్పయ్యేళ్ల బాధితురాలి పేరును వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. ఆమె రెండు కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి.
ఈ రోజు ఉదయం నాలుగు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమె గదిలోకి వచ్చారు. వారు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. వారు తనపై అత్యాచారం చేస్తారనే భయానికి గురైన ఆ విదేశీ పర్యాటకురాలు హఠాత్తుగా కిటికీ నుండి కిందకు దూకేసింది. రేప్ భయం కారణంగానే ఆమె దూకిందని ఆగ్రా పోలీసు సూపరింటెండెంట్ పవన్ కుమార్ చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడి పైన కేసు నమోదు చేసుకున్నారు.
కాగా, ఆగ్రాలోని తాజ్ మహల్ చూసేందుకు వస్తున్న ఓ స్విస్ యువతిపై మధ్య ప్రదేశ్‌లోని దతియా జిల్లాలో ఎనిమిది మంది అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన సంచలనం రేపింది. స్విట్జర్లాండు కూడా ఈ ఘటనపై వేగవంతంగా విచారణ జరిపించాలని భారత్‌ను కోరింది. కేంద్రమంత్రి చిరంజీవి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అది మర్చిపోకముందే హోటల్ సిబ్బంది ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడం, ఆమె దూకడం కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications