కొడుకు కొట్టాడని దంపతుల ఆత్మహత్య: వదిన హత్య

వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పసరగొండకి చెందిన దూలం అయిలయ్య (65) తన ఆస్తిని నలుగురు కుమారులకు పంచి ఇచ్చాడు. తన కోసం అర ఎకరం ఉంచుకుని భార్య కౌసల్య(60)తో కలసి వేరుగా నివసిస్తున్నాడు. తండ్రి వద్ద ఇంకా సొమ్ము ఉందన్న అనుమానంతో మూడో కుమారుడు దేవేందర్ సొమవారం వాదనకు దిగి డబ్బు అడిగాడు. అంతటితో ఆగక చేయి కూడా చేసుకున్నాడు.
కన్న కొడుకు చేతిలోనే దెబ్బతినాల్సి రావడంతో అయిలయ్య వ్యధ చెందాడు. ఆత్మహత్య చేసుకుంటానని భార్య కౌసల్యకు చెప్పడంతో, ఆమె చావైనాబతుకైనా నీతోనే అంది. కలిసి భోజనం చేశారు. అనంతరం పురుగుల మందు తాగారు.
అన్న రిటైర్మెంటు సొమ్ము కోసం సొంత వదిననే ఆమె మరదులు దారుణంగా హత్య చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన నరసింహులు ఇటీవల విద్యుత్ శాఖలో ఉద్యోగ విరమణ చేయడంతో ప్రావిడెంట్ ఫండ్, తదితర ప్రయోజనాల కింద దాదాపు రూ.30 లక్షలు వచ్చాయి. నర్సింహులు సోదరులు కృష్ణయ్య, పరశురాం తమకూ వాటా ఇవ్వాలన్నారు. అన్న అంగీకరించకపోవడంతో సోమవారం రాత్రి వదిన లక్ష్మమ్మను కత్తితో పొడిచి, గొంతు కోసి పరారయ్యారు.












Click it and Unblock the Notifications