అంతా అన్నదమ్ములే: ఐదుగుర్ని పెళ్లాడిన యువతి

నాలుగేళ్ల క్రితం ఆమె గుడ్డు వర్మ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. తర్వాత అతడి సోదరులు బైజు వర్మ, శాంతారామ్ వర్మ, గోపాల్ వర్మ, దినేశ్ వర్మను కూడా వరుసగా వివాహం చేసుకుంది. సంప్రదాయంలో భాగంగానే ఇలా వివాహం చేసుకున్నామని రాజోవర్మ వెల్లడించింది. తామంతా ఒకే ఇంటిలో నివసిస్తున్నామని, తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. తమ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉందని ఆమె భర్తలు చెబుతున్నారు.
మరో విషయం వారికి పద్దెనిమిది నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే ఆ బాబు తండ్రి ఆ ఐదుగురిలో ఎవరో తెలియదని వారు చెబుతున్నారు. ఐదుగురితో పెళ్లి అంటే మొదట అందరూ ఇబ్బందిగా భావించారని, తాను మాత్రం అలా భావించలేదని రాజోవర్మ చెప్పింది. తాము ఐదుగురం అన్నదమ్ములం ఆమెతో సంసారం చేస్తున్నామని, తమలో ఎవరికీ ఒకరిపై మరొకరికి అసూయ, ద్వేషం లేదని మొదటి భర్త గుడ్డు వర్మ అన్నాడు.
గుడ్డు వర్మను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న రాజోవర్మ ఆ తర్వాత బిజ్జు వర్మ(32), శాంతారామ్ వర్మ(28), గోపాల్ వర్మ(26)లను పెళ్లి చేసుకుంది. ఆఖరు తమ్ముడు దినేష్ వర్మకు గతేడాది పద్దెనిమిదేళ్లు దాటాయి. దీంతో అతనిని గతేడాది పెళ్లి చేసుకుంది. వారంతా ఒకే గదిలో ఉంటున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications