వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉంటారా?వెళ్తారా?: జగన్ వర్గంపై కిరణ్‌కి కోపమొచ్చింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుల పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం సాయంత్రం సిఎల్పీ సమావేశమయింది. ఈ సందర్భంగా ఆయన జగన్ వర్గంపై అనుకొని విధంగా రెచ్చిపోయారట. పార్టీలో ఉంటూ జగన్‌కు జై కొడుతున్న వారికి ముఖ్యమంత్రి ఘాటైన హెచ్చరికలు చేశారట.

ఉంటే ఉండండి.. లేదా వెళ్లిపోండి. అంతేకానీ పార్టీలో ఉంటూ నష్టం చేయవద్దని హెచ్చరించారట. పార్టీ విధానాలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని లేదంటే వెళ్లిపోవచ్చని సూచించారట. పార్టీలో ఉంటూ నష్టం చేస్తున్న వారి పైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి పలువురు సూచించారు. వారితో కిరణ్ ఏకీభవించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఏ మాత్రం ఉపేక్షించేది లేదని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు ప్రయత్నిస్తున్న వైయస్సార్ కాంగ్రెసుతో పాటు ఇతర ప్రత్యర్థులపైనా విరుచుకుపడాలని పార్టీ ఎమ్మెల్యేలకు కిరణ్ పిలుపునిచ్చారు. జగన్ ఒక్కడినే లక్ష్యం చేసుకోవాలన్నట్లుగా అంతా మాట్లాడుతున్నారని కానీ, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే విపక్షాలను లక్ష్యంగా చేసుకోవాల్సిందేనని చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం మద్దతు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కయ్యాయని జగన్ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకపోయామని కిరణ్ అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక తెలంగాణ కోరుతున్న తెరాస ప్రతిపాదించిన తీర్మానానికి జగన్ పార్టీ ఎలా మద్దతిచ్చిందని, ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని మనం ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పార్టీ అధినేతలపై విమర్శలు గుప్పిస్తున్న వారిని క్షమించేందుకు వీల్లేదని తక్షణమే ప్రతి విమర్శలు చేయాల్సిన అవసరం ఉందని పాలడుగు వెంకట్రావు చేసిన సూచనను బలపరిచారు.

English summary
CM Kiran Kumar Reddy was warned YSR Congress Party chief YS Jaganmohan Reddy camp Congress MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X