తెర పడేనా?: 'నందమూరి' గందరగోళం(పిక్చర్స్)

హైదరాబాద్: నందమూరి కుటుంబంలో విభేదాలున్నాయన్న ప్రచారానికి తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు చేశారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ వ్యవహార శైలిపై రాజకీయ వర్గాల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో అనుమానాలు కలిగించింది. జూనియర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన, బాబాయ్ బాలయ్య పైన తొడ గొడుతున్నారనే ప్రచారం జరిగింది.

ఈ ప్రచారం తెలుగుదేశం పార్టీలోను కలవరం పుట్టించింది. ఇంతలా ప్రచారం జరుగుతున్నా దీనిపై ఇప్పటి వరకు ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ చంద్రబాబు కానీ స్పందించలేదు. పార్టీ క్యాడర్ గందరగోళంలో ఉన్న నేపథ్యంలో ఈ విభేదాల ప్రచారానికి పుల్ స్టాప్ పెడితేనే బాగుంటుందని బాలయ్య భావించి ఉంటారు. అందులో భాగంగా విశాఖ పర్యటనలో మాట్లాడుతూ.. నందమూరి కుటుంబంలో విభేదాలు లేవని, జూనియర్‌తో ఎవరికీ ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

అయితే, బాలయ్య ప్రకటన కేవలం ఉపశమనం మాత్రమే అంటున్నారు. విభేదాల పైన ఎన్టీఆర్ మరోసారి పెదవి విప్పితేనే మరింత బలం చేకూరుతుందంటున్నారు. ఇటీవల విజయవాడ దుకాణ ప్రారంభోత్సవ సభలో, హైదరాబాదులో బాద్ షా ఆడియో వేడుకలో జూనియర్ బల ప్రదర్శన చేశారనే విమర్శలు వచ్చాయి. జూనియర్ బల ప్రదర్శన ప్రచారానికి బాలయ్య ఇప్పుడు చెక్ పెట్టారు. అయితే, ఎప్పుడూ విభేదాలు అంటూ ప్రచారం జరగడం, తర్వాత లేదని ప్రకటనలు రావడం క్యాడర్ జీర్ణించుకోలేకపోతోందంట.

2014 ఎన్నికల్లో టిడిపిని ఎలాగైనా అధికారంలోకి తీసుకు రావాలని చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జూనియర్‌తో విభేదాలు అంటే క్యాడర్‌లో అసంతృప్తి కనిపిస్తుందని, అందుకే అలాంటి వాటికి పుల్ స్టాప్ పెట్టి క్యాడర్‌లో ఉత్సాహం నింపితేనే బాగుంటుందని బాలయ్య అభిప్రాయపడి ఉంటారని అంటున్నారు. బాలయ్య ప్రకటనకు జూనియర్ ప్రకటన కూడా తోడైతే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

'నందమూరి' గందరగోళం(పిక్చర్స్)

విజయవాడలో జూనియర్ అభిమాన గణం. బల ప్రదర్శన కోసమే ఇలా చేశారనే ప్రచారం జరిగింది.

'నందమూరి' గందరగోళం(పిక్చర్స్)

బాద్ షా పాటల విడుదల కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్.

'నందమూరి' గందరగోళం(పిక్చర్స్)

కొడాలి నాని సమయంలో విభేదాలపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ బల ప్రదర్శన ప్రచారంపై స్పందించలేదు.

'నందమూరి' గందరగోళం(పిక్చర్స్)

బాలకృష్ణ మాత్రం పార్టీ భవిష్యత్తు దృష్ట్యా చెక్ పెట్టే ప్రయత్నాలు చేశారంటున్నారు.

'నందమూరి' గందరగోళం(పిక్చర్స్)

ఇటీవల చంద్రబాబు పాదయాత్రలో వల్లభనేని వంశీ వర్గం జూనియర్ ఫ్లెక్సీలు పెట్టడమే వివాదానికి దారి తీసిందంటున్నారు. అయితే, వాటిని ఖండిస్తున్న వారు కూడా ఉన్నారు.

'నందమూరి' గందరగోళం(పిక్చర్స్)

జూనియర్ ఎన్టీఆర్ బాబు పాదయాత్రలో పాల్గొనక పోవడం కూడా చర్చ అయింది.

నందమూరి-నారా కుటుంబంలో మొదటి నుండి ఇలాంటి గందర గోళ పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. హరికృష్ణ-బాబు, హరి-బాలయ్య, జూ ఎన్టీఆర్-బాబు, జూ ఎన్టీఆర్-బాలయ్యల మధ్య విభేదాలు అంటూ అప్పుడప్పుడు ప్రచారం జరుగుతోంది. అయితే, తర్వాత వాటిని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. అయితే, వారి మాటలు, వ్యవహార శైలి వల్ల ఇలాంటి ప్రచారం మళ్లీ మళ్లీ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+