వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ ఎన్టీఆర్‌తో విభేదాల్లేవు, బాబుతో కలుస్తా: బాలకృష్ణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna - Jr Ntr
విశాఖపట్నం: తన సోదరుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవని తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ శుక్రవారం చెప్పారు. ఆయన ఈ రోజు విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా జూనియర్ ఎన్టీఆర్‌తో విభేదాల గురించి ప్రస్తావించింది. దీనిపై బాలయ్య స్పందిస్తూ.. జూనియర్‌తో ఎలాంటి విభేదాల్లేవన్నారు.

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వస్తున్నా మీకోసం పాదయాత్రలో తాను పాల్గొంటానని బాలయ్య ఈ సందర్భంగా చెప్పారు. బాబుతో కలిసి పాదయాత్ర చేస్తానని చెప్పారు. చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుండి బాలయ్య పాల్గొంటారని చెబుతున్నారు. రెండుమూడుసార్లు బాలకృష్ణ బాబును కలిశారు. ఇటీవల కృష్ణా జిల్లా విజయవాడలోని గుడివాడ నియోజకవర్గంలో బాబు పాదయాత్రలో పాల్గొన్న బాలయ్య అంతా తానై చూశారు.

బాబు పాదయాత్ర పొడిగింపు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర వారం రోజుల పాటు పొడిగించనున్నారు. బాబు పాదయాత్ర ఏప్రిల్ 20వ తేదిన విశాఖపట్నంలో ముగుస్తుందని మొదట భావించారు. అయితే, ఏప్రిల్ 27వ తారీఖు వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు. ఏప్రిల్ 20న బాబు తన పుట్టిన రోజు వేడుకలను విశాఖలో జరుపుకుంటారు. ఆ తర్వాత కూడా వారం రోజుల పాటు పాదయాత్ర చేస్తారు.

English summary
Hero and Telugudesam Party leader Nandamuri Balakrishna said that there is no differences with Hero Junior NTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X