• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఢిల్లీకి తప్పిన ఉగ్రవాద ముప్పు, ఇద్దరి అరెస్టు

By Pratap
|
 Possible terror strike averted in Delhi; two suspected terrorists held
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీకి ఉగ్రవాద ముప్పు తప్పింది. పాత ఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గురువారం రాత్రి ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. దీంతో పోలీసులు ఢిల్లీలో ఉగ్రవాద దాడి ప్రయత్నాలను నిరోధించినట్లు భావిస్తున్నారు.

పోలీసులు గురువారం రాత్రి జమా మసీదు సమీపంలోని ఓ అతిథి గృహంపై దాడి చేశారు. ఉగ్రవాదులుగా అనుమానం ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు కూడా కాశ్మీరీలను తెలుస్తోంది. వారు ఉంటున్న గది నుంచి పోలీసులు పెద్దయెత్తున ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని, ఎకె 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత గదిని సీల్ చేశారు. హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన లికాయత్ షా ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. లికాయత్ షాను ఢిల్లీ పోలీసులు రెండు రోజుల క్రితం గోరఖ్‌పూర్‌లో అరెస్టు చేశారు.

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కీలు నిర్వహించినట్లు చెబుతున్నారు. హోలీ రోజు దాడులకు పాల్పడాలని వారు పథకం వేసుకున్నట్లు తెలుస్తోంది. హోలీ మార్చి 27వ తేదీన ఉంది. గోరఖ్‌పూర్‌లో అరెస్టు చేసిన లికాయక్ షాను 15 రోజుల పాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 The Delhi Police have averted a possible terror strike in the capital as its Special Cell on Thursday night detained two suspected terrorists from the Old Delhi area.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more