మోనికాయే మోడల్: 80 కోట్లు పలికిన 'చైనా చిన్నది'

Tretchikoff's Chinese girl fetches nearly Rs.80 crore
లండన్: ప్రఖ్యాత చిత్రకారుడు వ్లాదిమిర్ ట్రెట్చికోఫ్ గీసిన చైనా అమ్మాయి చిత్రం భారీ ధరకు అమ్ముడు పోయింది. లండన్‌లో ప్రముఖ వేలంపాట సంస్థ బాన్హామ్స్ ఈ చైనా అమ్మాయి చిత్రాన్ని విక్రయించింది. ఈ వేలంలో ఈ చిత్రం సుమారు రూ.80 కోట్లకు అమ్ముడుపోయింది. వ్లాదిమిర్ ట్రెట్చికోఫ్ చిత్రానికి ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి.

ఈ చిత్రం ధరను మొదట నలభై కోట్ల రూపాయల వరకు అంచనా వేశారు. అయితే, అందుకు రెట్టింపు ధర పలకడం విశేషం. తాము అనుకున్నదానికంటే రెండు రెట్ల ధర పలకడం ఆనందంగా ఉందని బాన్హామ్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లాండు దేశానికి చెందిన ప్రముఖ నగల వ్యాపారి లారెన్స్ గ్రాఫ్ కొనుగోలు చేశారు.

దక్షిణాఫ్రికాలోని తన ఎస్టేట్‌లో ఈ చిత్రాన్ని అలంకరిస్తారని ఆయన ప్రకటించారు. వ్లాదిమిర్ ట్రెట్చికోఫ్.. రష్యా సంతతికి చెందిన చిత్రకారుడు. చైనా షాంఘాయ్‌లోనే పెరిగారు. 1946 నుండి దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లోని ఓ దుకాణంలో కూలిగా పని చేస్తున్న పదిహేడేళ్ల మోనికా సింగ్ లీ అనే అమ్మాయని మోడల్‌గా ఎంచుకొని 1953లో చైన్న అమ్మాయిని సృష్టించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+