నా కుర్చీని లాగేయాలని చూస్తున్నారు: కిరణ్ ఫైర్

"మీ దయాదాక్షిణ్యాల మీద నేను లేను. కాంగ్రెసు పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు. సోనియా, మా ఎమ్మెల్యేలు కలిస్తే నేను సిఎంగా ఉన్నాను. నా కుర్చీ లాగడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మీ వల్ల కాదు. 2014 ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తాం" అని ఆయన అన్నారు. తనకు ముఖ్యమంత్రి అంటే కోపం లేదని గుండా మల్లేష్ అన్నారు.
తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెసు దాన్ని నిలబెట్టుకోకపోవడం వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చొరవ చూపితే రావణకాష్టాన్ని ఆపవచ్చునని, అందుకు తెలంగాణపై తీర్మానాన్ని సభలో ఆమోదించాలని, ఆ తర్వాత కేంద్రంతో తేల్చుకోవచ్చునని ఆయన అన్నారు. ఆంధ్ర పోలీసులు తమను అరెస్టు చేసి, సాయంత్రం వరకు పోలీసు స్టేషన్‌లో ఉంచారని ఆయన విమర్శించారు సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత సభదని ఆయన అన్నారు.
సిఎం ముందుండాలి: మోత్కుపల్లి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యమంత్రి ముందుండాలని తెలుగుదేశం సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణపై చిక్కుముడిని విప్పాల్సింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. కోదండరామ్ బృందాన్ని బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అరెస్టులకు మూలం ఏమిటో చెప్పాలని, అరెస్టులతో ఉద్యమం ఆగదని ఆయన అన్నారు.
సబితా ఇంద్రారెడ్డి మనస్సాక్షి అంగీకరించదు: హరీష్
అరెస్టులపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన ప్రకటనను ఆమె మనస్సాక్షి అంగీకరించదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుడు హరీష్ రావు అన్నారు. అరెస్టయిన నేతలు సంఘటనా స్థలంలో లేరని, అరెస్టయిన తర్వాత సంఘటనలు జరిగాయని ఆయన అన్నారు. ఈటెల, జూపల్లి అరెస్టులకు ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ కుట్రపూరిత వైఖరిని తాము ప్రశ్నిస్తున్నామని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినందుకే తమపై ప్రభుత్వం కక్ష కట్టిందని ఆయన అన్నారు
భయపడం, పోరాడుతాం: అక్బరుద్దీన్
తాము భయపడేది లేదని, ప్రభుత్వంపై పోరాడుతామని మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ అన్నారు. కాంగ్రెసుకు మద్దతు ఉపసంహరించుకున్నందుకే తనను జైల్లో పెట్టారని ఆయన విమర్శించారు. ప్రార్థనలకు వచ్చే ముస్లింలను అరెస్టు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తమ దేశభక్తిని ఎవరూ శంకించలేరని ఆయన అన్నారు. వికారాబాదులో ముస్లింలను వేధిస్తున్నారని ఆయన అన్నారు.
సడక్ బంద్‌లో వివక్ష ఎందుకని లోక్‌సత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ అడిగారు. బంద్‌లో అందరూ పాల్గొంటే ఎమ్మెల్యేలనే ఎందుకు అరెస్టు చేశారని ఆయన ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో లేదా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యురాలు శోభా నాగిరెడ్డి అడిగారు. సిబిఐని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం వాడుకుంటోందని ఆమె విమర్శించారు.
చట్టప్రకారమే వ్యవహరించారు: సబితా ఇంద్రారెడ్డి
సడక్ బంద్ సందర్భంగా పోలీసులు చట్టప్రకారమే వ్యవహరించారని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. చర్చకు ముందు ఆమె శాసనసభలో ఓ ప్రకటన చేశారు. శాంతిభద్రతలు, మహిళల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదని ఆమె అన్నారు. శానససభ్యుల అరెస్టు విషయాన్ని శాసనసభ కార్యదర్సికి తెలియజేసినట్లు ఆమె తెలిపారు. సడక్ బంద్ సందర్భంగా పోలీసులు సంయమనం పాటించారని ఆమె అన్నారు. పోలీసులు ఏ విధమైన బలప్రయోగం చేయలేదని చెప్పారు
సడక్ బంద్ సందర్భంగా 1400 మందికి పైగా అరెస్టయ్యారని, వారిని కేసులు పెట్టకుండా పోలీసులు వదిలేశారని ఆమె చెప్పారు అరెస్టులపై చట్టప్రకారమే పోలీసులు వ్యవహరించారని చెప్పారు. సడక్ బంద్‌కు అనుమతి లేదని పోలీసులు ముందే చెప్పారని ఆమె గుర్తు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరిగాయని, అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications