కోదండరామ్ సహా 8 మందికి బెయిల్: 3గురికి నో

Kodandaram
మహబూబ్‌నగర్: తెలంగాణ జెఎసి నేత కోదండరామ్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు, ఈటెల రాజేందర్‌లను ఉంచిన పాలమూరు జైలు వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. సడక్ బంద్ సందర్భంగా అరెస్టు చేసిన తెలంగాణ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వాదులు ఆందోళన చేపట్టారు. వారంతా జైలు ప్రాంగణంలోకి దూసుకుని వెళ్లారు.

జైలు గేట్ ముందు తెలంగాణ ధూంధాం చేపట్టారు. జైలు గేటులోపలికి కార్యకర్తలు దూసుకుపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జైలులో ఉన్న నేతలను చూడడానికి ఒకేసారి అందరినీ అనుమతించడం కుదరదని జైలు సిబ్బంది చెప్పడంతో ఆందోళనకు దిగారు. అయితే, ఆ తర్వాత పై అధికారుల అనుమతితో వారందరినీ ఒకేసారి అనుమతించారు. ఆ తర్వాత జైలు ప్రాంగణం నుంచి బయటకు పంపించారు.

శాసనసభ్యుడు కావేటి సమ్యయ్య, గట్టు తిమ్మప్ప, తుమ్మల రవిలకు కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. వీరు ముగ్గురు శనివారంనాడు కోర్టులో లొంగిపోయారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. కోదండరామ్, శ్రీనివాస గౌడ్, ఈటెల రాజేందర్, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి, భూషణం, దుబ్బన్న, గోవర్ధన్ సహా 8 మందికి పది వేల రూపాయలు పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

సడక్‌బంద్‌లో అరెస్టయిన శాసనసభ్యులు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ తదితరుల బెయిల్ పిటిషన్లపై అలంపూర కోర్టులో శనివారం ఉదయం వాదనలు పూర్తయ్యాయి. తీర్పును కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. పరారీలో ఉన్నారని చెప్పిన కావేటి సమ్మయ్య, మరో ఇద్దరు కోర్టులో లొంగిపోయారు. శనివారం సాయంత్రం కోదండరామ్ సహా 8 మందికి ఆలంపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురికి మాత్రం తిరస్కరించింది. ఈ కేసులో మొత్తం 11 మంది అరెస్టయ్యారు.

మహబూబ్‌నగర్ జైలులో ఉన్న తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య శనివారం పరామర్శించారు. తెలంగాణ ముఖ్య నాయకులను జైలులో పెడితే ఉద్యమం మరింత ఉధృతమవుతుందని చుక్కా రామయ్య అన్నారు.

కాగా, జైలులో ఉన్న నేతలను పరామర్శించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి జైలులో ఉన్న నేతలను పరామర్శించారు. గంట పాటు కెసిఆర్ జైలులో ఉన్నవారితో మాట్లాడారు. ఆయనతో పాటు హరీష్ రావు, నాయని నర్సింహారెడ్డి ఉన్నారు.

కిరణ్ రెడ్డి మూల్యం చెల్లించక తప్పదు: కెసిఆర్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూల్యం చెల్లించకతప్పదని కెసిఆర్ హెచ్చరించారు. కాసు బ్రహ్మాంద రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు తెలంగాణ ఉద్యమం చాలా మంది ముఖ్యమంత్రులను చూసిందని ఆయన అన్నారు. కోదండరామ్, ఈటెల రాజేందర్ అరెస్టు అప్రజాస్వామికమని ఆయన అన్నారు. అవాంఛనీయమైన సంఘటనలు ఏవీ జరగకున్నా వారిని పోలీసులు అరెస్టు చేశారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+