వికారాబాదులో భారీ పేలుడు: ఇద్దరు దుర్మరణం

Rangareddy map
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మరణించారు. నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పేలింది బాంబులా? జిలెటిన్ స్టిక్సా? గ్యాస్ సిలిండరా? అనే విషయం తెలియక కొన్ని గంటలపాటు ఉద్రిక్తత, ఆందోళన నెలకొంది. పేలింది బాంబులు కాదని, గ్యాస్ లీక్ కావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఉద్రిక్తత సడలింది.

వివరాలు ఇలా ఉన్నాయి - శుక్రవారం రాత్రి 8.10 గంటలకు వికారాబాద్‌లోని రాజీవ్ గృహకల్ప కాలనీలోని బ్లాక్ నెంబర్ 57లోని 10 నంబర్ ఇంటి నుంచి గ్యాస్ లీక్ అవుతున్న వాసన వచ్చింది. ఆ సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో చుట్టు పక్కల వారు ఇంటి యజమాని మజీబ్‌కు ఫోన్ చేశారు. 'మీ ఇంట్లోంచి గ్యాస్ లీక్ అవుతోంది' అని తెలిపారు. దీంతో మజీబ్ హుటాహుటిన అక్కడికి వచ్చారు.

మజీబ్, ఏసయ్య కలిసి తలుపులు తెరిచారు. తెరిచీ తెరవగానే భారీ పేలుడు సంభవించింది. దీని ధాటికి పైన, కింద కలిపి నాలుగు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గోడలు మొత్తం కూలిపోయాయి. ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. పేలుడు సమయంలో ఒక్కసారిపెద్ద మంట వచ్చింది. తర్వాత ఎలాంటి మంటలు వ్యాపించలేదు. మజీబ్, ఏసయ్యతోపాటు అక్కడ ఏం జరుగుతోందో చూసేందుకు వచ్చిన వారిలో చాలా మంది బాధితులుగా మిగిలారు.

మజీబ్, ఏసయ్య తీవ్రంగా గాయపడ్డారు. వారి వెనుకే గుంపుగా ఉన్న వారిలో మంగలి వసంత (40), కార్తీక్ (6) అక్కడిక్కడే మరణించారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో సాయి చరణ్, అంజలి అనే ఇద్దరు పిల్లలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇంట్లో జిలిటెన్ స్టిక్స్ ఉండి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ లీక్‌తోపాటు జిలెటిన్ స్టిక్స్ కూడా పేలడంవల్లే తీవ్రత అధికంగా ఉండొచ్చుని భావిస్తున్నారు.

పేలుడు జరిగినే వెంటనే రంగారెడ్డి రూరల్ ఎస్పీ రాజకుమారి, సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక మంత్రి ప్రసాద్ కుమార్ కూడా హుటాహుటినా అక్కడకు చేరుకున్నారు. హోంమంత్రి సబితారెడ్డి ఎప్పటికపుడు పరిస్థితిని పర్యవేక్షించారు. పేలుళ్ల సంఘటన పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+