'మహా' ఎటిఎస్ డిఎస్పీ ఆత్మహత్య: భార్యాపిల్లల ఎదుటే

Maharastra map
ముంబై: మాహారాష్ట్రలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. మాహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) డిప్యూటీ పోలీసు కమిషనర్ (డిఎస్పీ) సంజయ్ బెనర్జీ (47) ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం తనను తాను రివాల్వర్‌తో కాల్చుకుని మరణించాడు. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు పలువురు చూస్తుండగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. థానేలోని గోవా పోర్చుగీసు రెస్టారెంట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. జాతీయ మీడియాలో ఈ మేరకు వార్తలు వచ్చాయి.

జాతీయ మీడియా వార్తల ప్రకారం - బెనర్జీ తన భార్యను, పిల్లలను తీసుకుని రెస్టారెంట్‌కు మధ్యాహ్నం భోజనానికి వెళ్లారని, అధికారిక వాహనాన్ని తీసుకుని వెళ్లలేదని, ఇంటి వద్దనే ఉండాలని ఆపరేటర్‌కు, డ్రైవర్‌కు చెప్పారని, ప్రైవేట్ కారులో హోటల్‌కు వెళ్లారని అంటున్నారు.

భోజనానికి ఆర్డర్ ఇచ్చారని, అందరూ మాటల్లో మునిగిపోయారని, ఇంతలో సాయంత్రం 3 గంటల ప్రాంతంలో సర్వీస్ రివాల్వర్ తీసి, తలపై రెండు సార్లు కాల్చుకున్నాడని, రక్తమోడుతూ కింద పడిపోయాడని పోలీసులు చెబుతున్నారు. హోటల్ సిబ్బంది, విజిటర్స్ భయాందోళనలతో నివ్వెరపోయారు. వెంటనే ఆయనను థానే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించారు.

సంజయ్ బెనర్జీ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు సూసైడ్ నోట్ కూడా లభించలేదు. మహారాష్ట్ర రాష్ట్ర పోలీసు సర్వీసులో ఆయన 1996లో పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ)గా చేరారు. ఆయన మొదటి పోస్టింగ్ నాందేడ్ డివిజనల్ పోలీసు ఆఫీసరుగా జరిగింది. 2012 జూన్ 25వ తేదీన ఆయన ఎటిఎస్‌లో చేరారు. కౌంటర్ టెర్రర్ పోలీసు ఏజెన్సీలోని డాటా అనాలిసిస్ వింగ్‌లో పనిచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+