భారత్‌తో సత్సంబంధాలే: పాక్ గడ్డపై ముషారఫ్ అడుగు

ముషారఫ్ ఆల్ పార్టీ ముస్లీం లీగ్ పార్టీ నేత. కరాచీలో అడుగు పెట్టిన తర్వాత ముషారఫ్ మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. సాయంత్రం ఐదు గంటలకు విమానాశ్రయం వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తానని ముషారఫ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ముషారఫ్ విమానం ఎక్కి సీట్లో కూర్చున్న తన ఫోటోను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
ముషారఫ్ పైన పలు ఆరోపణలు ఉన్నాయి. 2006-07లో న్యాయమూర్తులను నిర్బంధించారనే ఆరోపణలు, దివంగత పాక్ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య కుట్ర ఆరోపణ, బెలూచిస్తాన్ లీడర్ నవాబ్ హత్య కేసులో ఆరోపణలను ముషారఫ్ ఎదుర్కొంటున్నారు. మరోవైపు ముషారఫ్ వస్తే ఆత్మాహుతి దాడులతో మట్టుబెడుతామని తాలిబన్‌లు హెచ్చరించారు.
పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ తమకు లొంగిపోవాలని, లేకపోతే ఆత్మాహుతి దాడితో అంతం చేస్తామని పాక్ తాలిబన్లు హెచ్చరించారు. శనివారం తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ అధికార ప్రతినిధి ఇహ్‌సానుల్లా ఇహ్‌సాన్ మీడియా ప్రతినిధులకు పంపిన వీడియోలో ఈ మేరకు ప్రకటించారు.
లాల్ మసీదుపై 2007నాటి దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం... నిన్ను ప్రాణాలతో వదిలేది లేదు'' అని అందులో పేర్కొన్నారు. అలాగే ముషారఫ్‌పై హత్యాయత్నం తర్వాత జైలుపాలై, నిరుడు తప్పించుకుపోయిన ఉగ్రవాది అద్నన్ రషీద్ కొందరు ఆత్మాహుతి దళ సభ్యులకు శిక్షణ ఇస్తున్న దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి.
అయితే, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని ముషారఫ్ దీటుగా బదులిచ్చారు. నాలుగేళ్లుగా లండన్‌లో తలదాచుకున్న అనంతరం శనివారం రాత్రి దుబాయ్‌కి చేరుకున్నారు. అనంతరం ఈ ఉదయం ఆదివారం కరాచీకి బయలుదేరి వచ్చారు. "నాలుగు దశాబ్దాలపాటు సైన్యంలో ఉన్నాను. కాకలు తీరిన మాజీ కమాండోనైన నేను, పిరికిపందల బెదిరింపులకు భయపడబోన''నని తాలిబన్లకు ధీటుగా స్పందించారు.
భారత్‌తో సంబంధాలు మెరుగుపడాలి
భారత దేశంతో సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరముందని ముషారఫ్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య శాంతిపునరుద్ధరణకు తాను కృషి చేస్తానని చెప్పారు. పాకిస్తాన్‌ను రక్షించాల్సిన అవసరముందన్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications