నువ్వెలా గెలుస్తావ్?: అక్బరుద్దీన్‌కు కిషన్ రెడ్డి సవాల్

హిందువులు, వారి పండుగలు, శ్రీరాముడి గురించి నీచంగా మాట్లాడి దేశ సమైక్యత, సమగ్రతను అగౌరవపర్చారంటూ అక్బర్‌పై నిప్పులు చెరిగారు. బిజెపిని గెలిపిద్దాం.. హైదరాబాద్‌ను రక్షించుకుందామనే నినాదంతో ఎన్నికలను ఎదుర్కొవాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో మజ్లిస్ ఆగడాలు ఎక్కువయ్యాయని, దానిని ఎదుర్కొనే శక్తి బిజెపికే ఉందన్నారు.
బిజెపికి ఓట్లు వేస్తే దేశాన్ని గుజరాత్‌లా చేస్తామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆదివారం అన్నారు. యూపిఏ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందని, దాని పరిస్థితి ఈవాళో, రేపో అన్నట్లు ఉన్నందువల్ల 2013లోనే పార్లమెంటుకు ఎన్నికలు జరగడం తథ్యమని, ముందస్తుకు అందరూ సిద్ధం కావాలని సూచించారు. యూపిఏ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు.
బిజెపి చేపట్టిన ప్రజా చైతన్య సదస్సును ఆదివారం హైదరాబాద్‌లోని కేశవ మోమోరియల్ స్కూల్ గ్రౌండ్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ధరలు పెరిగిపోయాయని, కరెంట్ కొరత, గ్యాస్ సిలిండర్ల కోతతో ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారని, ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
యూపిఏలో పార్టీలన్నీ దారులు వెతుక్కుంటున్నాయని, ఈ ప్రభుత్వం ఏ క్షణంలో కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అక్టోబర్ నాటికి పార్లమెంట్ ఎన్నికలు జరగడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు, మాయవతి, ములాయం సింగ్ ఎవరికి వారే మూడో ప్రత్యామ్నాయం గురించి మాట్లాడుతున్నా, అదంతా మిథ్య అని తేల్చేశారు. గుజరాత్ తరహా అభివృద్ధిని ఈ దేశంలో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఎపిలో సర్వేచేయిస్తే 62% నరేంద్ర మోడీ వైపు ఆకర్షితులవుతున్నట్లు తేలిందన్నారు. ఎన్డీయే అధికారంలోకి రాగానే తెలంగాణ ఇవ్వడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications