జగన్ పాచిక: సుధీర్ జంప్! ఎమ్మెల్యే షాకిచ్చినట్లేనా?

YS Jagan - Devireddy Sudhir Reddy
హైదరాబాద్: తన పార్టీ మారే ఊహాగానాలపై అధికార పార్టీకి చెందిన ఎల్బీ నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సోమవారం అందరికంటే భిన్నంగా స్పందించిన విషయం తెలిసిందే. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. తన పార్టీ మార్పు ప్రచారంపై ఆయన స్వయంగా స్పందించలేదు.

అయితే, పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుండటంతో దానిని కొట్టివేయాలని పార్టీ ఆదేశించినట్లుగా దేవిరెడ్డి చెప్పారు. అంతేకాదు, కొట్టిపారేయాలని చెప్పిన వారికి ఝలక్ ఇచ్చారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళితే ఎవరు ఆపలేరని, తనకు వెళ్లాలనే ఆలోచన ఉంటే ఎప్పుడైనా వెళ్లే అవకాశం అక్కడ ఉందని చెప్పారు. అదే సమయంలో పార్టీ మారే విషయంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

ఆయన వైఖరి చూస్తుంటే ఆయన కూడా ఏ క్షణంలోనైనా జగన్ పార్టీలోకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. సుధీర్ రెడ్డికి జగన్ వైపు వెళ్లాలనే ఆలోచన ఉన్నా దానిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు మరెంతో దూరం లేనందున ఉప ఎన్నికలకు వెళ్లేందుకు ఇష్టం లేకపోవడమో లేక తెలంగాణపై ఆ పార్టీ వైఖరి పూర్తిగా తేలాకో వెళ్లాలనే భావనలో ఆయన ఉండి ఉంటారని అంటున్నారు.

తెలంగాణ అంశం అధిష్టానం తేల్చాల్సి ఉంటుంది. జగన్ పార్టీ తన వైఖరి చెప్పానని చెబుతోంది. దీంతో ఉప ఎన్నికలకు ఇష్టం లేకనే ఆయన ఇప్పుడే వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదంటున్నారు. అంతేకాకుండా జగన్ తన వ్యూహంలో భాగంగా కూడా సుధీర్ రెడ్డిని ఆపి ఉంటారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల చేరిక విషయంలో జగన్ మొదటి నుండి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

నిత్యం ప్రసార సాధనాల్లో ఉండేందుకు జగన్... తన వైపుకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎమ్మెల్యేలను అంచెలంచెలుగా పార్టీలో చేర్పించుకుంటున్నారనేది మొదటి నుండి ఉన్న వాదన. అందులో భాగంగానే సుధీర్ రెడ్డి ఇప్పటికిప్పుడు చేరడం లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వివిధ జిల్లాల్లో జగన్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్లారు. అయితే, రాజధానిలో ఇప్పటి వరకు ఎవరూ వెళ్లలేదు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, సుధీర్ రెడ్డి తదితరులకు మంచి సంబంధాలు ఉండేవి. జగన్ వేరే పార్టీ పెట్టాక దానం కూడా వెళతారనే ప్రచారం కొంతకాలం సాగింది. కానీ, వాటిని ఆన కొట్టిపారేశారు. ఇటీవలి వరకు నగరంలో ఎవరూ జగన్ వైపుకు చూడలేదు. రెండు రోజుల క్రితం కూన శ్రీశైలం గౌడ్ జైలుకు వెళ్లి జగన్‌ను కలిశారు. శ్రీశైలం గౌడ్ కలిసిన అనంతరం మరో ఎమ్మెల్యే కూడా అదే దార్లో ఉన్నారనే ప్రచారం సాగింది.

సుధీర్ రెడ్డికి వైయస్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. జగన్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారాన్ని ఖండించమని పార్టీ పెద్దలు చెప్పారని, తాను వెళ్లాలనుకుంటే ఎవరూ ఆపలేరని, ఎప్పుడైనా వెళ్లవచ్చుననే ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే అయన జగన్ వైపుకు వెళ్లేందుకే సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అయితే, ఆయన చేరిక మాత్రం జగన్ పాచిక ప్రకారమే ఉంటుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+